కైకాల సత్యనారాయణ , చలపతిరావు మధ్య ఉన్న ఈ పోలికల గురించి మీకు తెలుసా?

గడిచిన నాలుగు నెలల్లో నలుగురు సినీ ప్రముఖులు మరణించారని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు ఆ వార్తలను జీర్ణించుకోలేకపోతున్నాయి.సెలబ్రిటీల కుటుంబాలలో వరుస విషాదాలు సామాన్య ప్రేక్షకులను సైతం బాధ పెడుతున్నాయి.

 Similarities Between Kaikala Satyanarayana And Chalapathi Rao Details Here Goes-TeluguStop.com

కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు కొన్ని నెలల గ్యాప్ లో మృతి చెంది అభిమానులకు ఎంతో బాధను మిగిల్చారు.కొన్నిరోజుల గ్యాప్ లో సత్యనారాయణ, చలపతిరావు మృతి చెందడం అభిమానులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది.

అయితే కైకాల సత్యనారాయణ, చలపతిరావు మధ్య ఉన్న కొన్ని పోలికల గురించి ప్రస్తుతం అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది.ఈ ఇద్దరు ప్రముఖ నటులు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం.

కైకాల సత్యనారాయణ సొంతూరు కృష్ణా జిల్లాలోని కవుతరం కాగా చలపతిరావు సొంతూరు కృష్ణా జిల్లాలోని బల్లిపర్రు.అటు సత్యనారాయణ ఇటు చలపతిరావు తమ సినీ కెరీర్ లో విలన్ రోల్స్ లో మెప్పించడంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు.

వయసు పెరుగుతున్నా సినిమాలకు సత్యనారాయణ, చలపతిరావు ప్రాధాన్యతనిచ్చారు.సత్యనారాయణ చివరి సినిమా మహర్షి కాగా విడుదలైన సినిమాలలో చలపతిరావు చివరి సినిమా బంగార్రాజు కావడం గమనార్హం.కైకాల సత్యనారాయణ, చలపతిరావు సీనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులు కావడంతో పాటు ఈ ఇద్దరు నటులకు నందమూరి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది.

కైకాల సత్యనారాయణ వారసులు సినిమా రంగంలో నిర్మాతలుగా రాణిస్తుండగా చలపతిరావు కొడుకు రవిబాబు యాక్టర్ గా, డైరెక్టర్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.48 గంటల గ్యాప్ లో ఇద్దరు సినీ ప్రముఖులు మరణించడంతో 2022 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ ఇయర్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.సినిమా ఇండస్ట్రీ కొన్ని నెలల గ్యాప్ లోనే నలుగురు లెజెండ్స్ ను కోల్పోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube