ఆ బిజినెస్ వదిలి సినిమాల్లోకి రావడం ఆనందంగా ఉంది: మురళీమోహన్

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు మురళీమోహన్ గురించి అందరికీ సుపరిచితమే.అయితే ఈయన సినిమాలలో రాణిస్తూనే మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టానని రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా మంచి లాభాలను ఆర్జించానని ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా చెప్పుకొచ్చారు.

 Glad To Leave That Business And Enter Films Murali Mohan ,murali Mohan Business-TeluguStop.com

ఇలా ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఇకపోతే తాజాగా మురళీమోహన్ మణిశంకర్ అనే సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శివ కంఠమనేని హీరోగా, సంజనా గల్రానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి జి.వెంకట్‌ కృష్టణ్‌ (జి.వి.కె) దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా మురళీమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఇక ఈ మణిశంకర్ సినిమాని నిర్మించినటువంటి లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం.ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ క్రమంలోనే మురళీమోహన్ ఈ సినిమా నిర్మాతల గురించి మాట్లాడుతూ… మేమందరం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములమని తెలిపారు.ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వీరందరూ ఇలా సినిమా రంగంలోకి రావడం చాలా ఆనందంగా ఉందని, మణిశంకర్ సినిమా తప్పకుండా హిట్ కావాలని ఈయన తెలిపారు.ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే సినిమాపై మంచి ఆసక్తి కలుగుతుంది అంటూ ఈ సందర్భంగా మురళి మోహన్ ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube