కాంతార ను ఆ మాట అంటే ఒప్పుకోని హీరో రిషబ్ శెట్టి

కన్నడం లో రూపొందిన కాంతార సినిమా దేశ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కన్నడం తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం లో కూడా ఈ సినిమా డబ్బింగ్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా రూ.450 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం అందుతుంది.ఒక చిన్న బడ్జెట్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం అద్భుతం అన్నట్లుగా చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో పదే పదే ఈ సినిమా లో బడ్జెట్ సినిమా అంటూ ప్రచారం చేయడం తో సినిమా లో హీరోగా నటించిన దర్శకత్వ బాధ్యతలను చూసిన రిషబ్ శెట్టి అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

 Kantara Movie Budget And Collections , Kantara, Flim News, News In Telugu , Rish-TeluguStop.com

కాంతార సినిమా తక్కువ బడ్జెట్ సినిమా కాదని.లో బడ్జెట్ తో ఈ సినిమా ని రూపొందించ లేదని ఆయన పేర్కొన్నాడు.

Telugu Kantara, Telugu, Rishab Shetty-Movie

కన్నడ సినిమా ఇండస్ట్రీ మరియు మార్కెట్‌ కు తగ్గట్లుగా భారీ బడ్జెట్ తోనే సినిమా ను రూపొందించామని.అయితే ఈ సినిమా దక్కించుకున్న కలెక్షన్స్ తో పోలిస్తే పెట్టిన పెట్టుబడి లో బడ్జెట్ అన్నట్లుగా అంతా భావిస్తున్నారని అతడు అభిప్రాయం వ్యక్తం చేశాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంతార సినిమా కు ఆయన కేవలం ఐదున్నర కోట్ల రూపాయల పారితోషం తీసుకున్నాడట.సినిమా సక్సెస్ అయిన తర్వాత మరో ఐదు కోట్ల రూపాయలను నిర్మాతలు ఆయనకు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.మొత్తానికి కాంతార సినిమా తో రిషబ్‌ శెట్టి కి దక్కింది కొద్దిగా అయినా కూడా వచ్చిన పేరు మాత్రం చాలా ఎక్కువ.

ముందు ముందు ఆయన సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల కాబోతున్నాయి.కనుక ప్రతి ఒక్క సినిమా కూడా భారీ బడ్జెట్ తో ఇక నుండి రూపొందే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube