అయస్కాంతంతో నడిచే కారు.. ఆ దేశం చేసిన మరో ప్రయోగం?

మన ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎన్నో కొత్త పొంతలు తొక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే ప్రపంచంలో టెక్నాలజీ ద్వారా కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ ఎన్నో దేశాలు ముందుకు వెళ్తున్నాయి.

 China Test Drives Magnetic Powered Car Details, China , Magnetic Powered Car, Ma-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా వేరే దేశాలతో పోల్చుకుంటే చైనా కొత్త టెక్నాలజీలతో ప్రపంచంలోనే ఉన్న అన్ని దేశాల కంటే ప్రయోగాలను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ దూసుకుపోతోంది.ఇప్పటికే చైనా ఎన్నో ప్రయోగాలు చేసి వాటిని సాధించిన విషయం కూడా మన అందరికీ తెలిసింది.

ఈ క్రమంలోనే తాజాగా చైనా మరొక వండర్ను క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యింది.ఇప్పటికే మార్కెట్లలో ఇంజన్ తో నడిచే కార్లు, ఎలక్ట్రిక్ తో నడిచే కార్లు విడుదలైన విషయం తెలిసిందే.

కానీ వీటితో పాటు తాజాగా మరొక కొత్త కారును చైనా సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది.అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి ఏకంగా మ్యాగ్నెటిక్ కారుని తయారు చేసింది.

అయితే ఈ మ్యాగ్నెటిక్ కారు టెస్ట్ డ్రైవ్ ను కూడా ఇప్పటికీ పూర్తి చేసింది.గత ఏడాది చైనా అయస్కాంత శక్తితో నడిచే రైలును కనుగొన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ టెక్నాలజీనే అక్కడ మాగ్లేఫ్ అని పిలుస్తారు.దీంతో ప్రస్తుతం చైనా అదే టెక్నాలజీని వాడి కారును సిద్ధం చేసింది 2.8 టన్నుల బరువు ఉన్న కారు టెస్ట్ డ్రైవ్ లో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది.

Telugu Chaina, China, Chinese, International, Maglev Car, Maglev Trains, Magnet

జియాన్ ప్రావిన్స్ హైవేపై ఈ డ్రైవ్ టెస్ట్ను చేశారు.అంతే కాకుండా ఈ కారు గ్రౌండ్ ను కూడా టచ్ చేయకుండా ప్రయాణం ప్రయాణిస్తుంది.దీనికి కారణం ఇవి విద్యుత్ అయస్కాంత శక్తి ఆధారంగా నడుస్తాయి.

ఈ టెక్నాలజీతో తయారు చేసిన వాహనాలు సాధారణమైన రోడ్లపై మాత్రం ప్రయాణించలేవు.ప్రత్యేకంగా నిర్మించిన విద్యుత్ అయస్కాంత ట్రాక్లపై మాత్రమే ప్రయాణిస్తాయి.

అయితే ఇప్పుడు ఈ మాగ్లో పార్కు కూడా ఈ ఫార్ములానే అనుసరించాల్సి ఉంటుంది.దీని కోసం భారీ మొత్తంలో నిధులు అవసరం అవుతాయి.

మొత్తం రోడ్లను పూర్తిగా మార్చాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube