క్రోమ్ బ్రౌజర్‌లో అద్భుతమైన ఫీచర్.. తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు!

టెక్ దిగ్గజం గూగుల్ తన క్రోమ్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్‌లో ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేసిన గూగుల్ ఈ వారం క్రోమ్‌ యూజర్లందరికీ రిలీజ్ చేసింది.

 An Amazing Feature In The Chrome Browser Google, Chrome Browser, Google Chrome S-TeluguStop.com

ఆ ఫీచర్ మరేదో కాదు చాలామంది యూజర్లు ఎంతో కాలంగా వేచి చూస్తున్నా పాస్‌కీలు.ఈ పాస్‌కీలు పాస్‌వర్డ్‌లు వాడాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగిస్తాయి.

అలానే హ్యాకింగ్, ఫిషింగ్ వంటి సైబర్ ఎటాక్స్ నుంచి యూజర్లను కాపాడతాయి.

అకౌంట్స్‌కి భద్రతగా నెటిజన్లు పెట్టుకునే పాస్‌వర్డ్‌లు ఫిషింగ్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువ.

అలానే డేటా లీక్స్‌ జరిగినప్పుడు పాస్‌వర్డ్స్‌ ఇతరుల చేతిలో పడిపోయే అవకాశం ఉంది.గూగుల్ ఈ సమస్యలను పరిష్కరించేందుకు 2-స్టెప్ వెరిఫికేషన్, గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ వంటి ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్స్ అందించింది.

ఇవి కూడా పూర్తి రక్షణ అందించలేకపోతున్నాయి.అందుకే పాస్‌వర్డ్ లెస్ పాస్‌కీలు పరిచయం చేసింది.

సపోర్టెడ్ సైట్‌లు, యాప్‌లకు సైన్ ఇన్ చేయడానికి ఈ పాస్‌కీలను ఉపయోగించవచ్చు.పాస్‌కీతో సైన్ ఇన్ చేయడం వల్ల మీరు డివైజ్‌ను అన్‌లాక్ చేసిన విధంగానే మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకొని లాగిన్ అవ్వచ్చు.

Telugu Chrome Browser, Google, Google Chrome, Googlechrome, Passkeys-Latest News

ప్రస్తుతం, క్రోమ్ విండోస్ 11, మ్యాక్ ఓఎస్, ఆండ్రాయిడ్‌ యూజర్లకు పాస్‌కీలు అందుబాటులోకి వచ్చాయి. పాస్‌కీలను మళ్లీ ఉపయోగించడం కుదరదు.సర్వర్‌లోని లోపాల వల్ల ఇవి లీక్ కావు.ఇవి వెబ్‌సైట్‌లు, యాప్‌లు రెండింటిలోనూ ఉపయోగించవచ్చు.ఆండ్రాయిడ్‌లో, పాస్‌కీలు గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ ద్వారా సురక్షితంగా సింక్ అవుతాయి.మీరు మీ డివైజ్‌లో పాస్‌కీని సేవ్ చేసిన తర్వాత, సైన్ ఇన్ చేస్తున్నప్పుడు అది ఆటోఫిల్‌లో కనిపిస్తుంది.

దీనివల్ల మరింత సేఫ్టీ అందుతుంది.డెస్క్‌టాప్‌లో, నియర్‌బై మొబైల్ డివైజ్ నుంచి పాస్‌కీని ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా అకౌంట్స్ ని యూజర్లు చాలా సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube