డీజే టిల్లు సూపర్ హిట్ అవడంతో ఆ సినిమా సీక్వెల్ మీద ఎక్కడ లేని అంచనాలు పెరిగాయి.సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమా సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నారు.
ఆయన ప్లేస్ లో మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా విషయంలో కొన్ని వార్తలు ఆడియన్స్ ని షాక్ ఇస్తున్నాయి.
టిల్లు స్క్వేర్ లో రాధిక అదే డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి లేదని చెప్పారు.ఆమె ప్లేస్ లో కన్నడ భామ శ్రీలీల ని తీసుకున్నారని చెప్పారు.
కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె ఎగ్జిట్ అయ్యింది.
ఇక శ్రీ లీల ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది.
ఆమె కూడా షూటింగ్ స్పాట్ నుంచే కాదు సినిమా నుంచే బయటకు వచ్చేసిందట.మళయాళ భామ మడోన్నా సెబాస్టియన్ ని ఫైనల్ గా హీరోయిన్ ని చేశారని అన్నారు.
కానీ ఆమె కూడా చేయట్లేదని తెలుస్తుంది.అయితే ఈ హీరోయిన్స్ అంతా కూడా సెట్ లో హీరో ప్రవర్తన నచ్చకనే అలా చేస్తున్నారని టాక్.
డీజే టిల్లు సూపర్ హిట్ అవడంతో హీరో సిద్ధు జొన్నలగడ్డకి కొద్దిగా కాన్ ఫిడెన్స్ పెరిగిపోయిందని.టిల్లు స్క్వేర్ కి కూడా అతనే రైటర్ కాబట్టి సినిమా అంతా తనకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడని అంటున్నారు.
అందుకే హీరో వల్లే హీరోయిన్స్ ఎవరు ఆ సినిమాలో ఉండలేకపోతున్నారని టాక్.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిమ ఉందో తెలియాల్సి ఉంది.