1.అగ్రిగోల్డ్ బాధితుల నిరాహార దీక్ష
ఆరు డిమాండ్లతో ఆగ్రి గోల్డ్ కంపెనీ బాధితులు 30 గంటల దర్మగ్రహ దీక్షలు చేపట్టారు.
2.ప్రవేట్ ఆసుపత్రిలలో కోవిడ్ ఆంక్షలు సడలింపు
తమిళనాడు వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా పరీక్షలపై విధించిన ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం భావిస్తూ ఉందని తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు.
3.కొత్త సచివాలయం ప్రారంభం కి ముహూర్తం ఖరారు
కొత్త సచివాలయం ప్రారంభం కి ముహూర్తం తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసింది.2023 జనవరి 18న కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తారు.
4.బండి సంజయ్ పాదయాత్రకు కోర్టు అనుమతి
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
5.మల్లారెడ్డి ఐటీ కేసులో కొనసాగుతున్న విచారణ
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది.
6.జగ్గారెడ్డి కామెంట్స్
రేవంత్ రెడ్డిని దించేయాలని నేను అనలేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని ఆయన వ్యాఖ్యానించారు.
7.అనంతపురం ఎస్పీతో టిడిపి నేతల భేటీ
అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్పతో టిడిపి నేతలు సోమవారం భేటీ అయ్యారు.
8.రాప్తాడు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులను అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
9.జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి .వాల్మీకి, బోయ కులాలను ఎస్టీల్లో చేరిస్తే రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి.
10.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయాయి.శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.
11.ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో 14వ బాలల దినోత్సవం ఈనెల 26న ఘనంగా జరిగింది.
12.భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో తొక్కేసిలాట జరిగింది.ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కిందపడడంతో అతని చేయి మోకాలికి గాయాలయ్యాయి.
13.రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పాలి
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా తక్షణమే క్షమాపణలు చెప్పాలని హైద్రాబాద్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి డిమాండ్ చేశారు.
14.శ్రీవారి సేవలు జస్టిస్ గంగారావు
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
15.మంత్రి రోజా కామెంట్స్
ఏపీలో ఏ కార్యక్రమం జరిగిన ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు.
16.దళిత బంధు లో జర్నలిస్టులకు అవకాశం
దళిత బందులో జర్నలిస్టులు కూడా అవకాశం కల్పిస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు.
17.ఏపీ కొత్త సిఎస్ గా జవహర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి నియమితులయ్యారు.
18.అన్ని జిల్లాల కలెక్టర్లతో కెసిఆర్ సమీక్ష
నేడు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో కెసిఆర్ భేటీ అయ్యారు.ముఖ్యంగా ధరణి పోర్టల్ లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశాన్ని నిర్వహించారు.
19.ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్
నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,560 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,980
.