ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.దేవాంతకుడు సినిమా ఇద్దరు హీరోల సినిమా అని ఈ మూవీ కన్నడ మూవీ రీమేక్ అని తెలిపారు.
చిరంజీవి, రజనీకాంత్ లతో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నామని ఆయన కామెంట్లు చేశారు.రజనీకాంత్ కు ఆ తర్వాత కుదరలేదని ఆయన తెలిపారు.
సుమన్ ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోకపోవడంతో కథ విషయంలో రెండో పాత్రను తగ్గించామని నారాయణ రావు అన్నారు.చిరంజీవి గారితో తీసిన ఆ సినిమా సక్సెస్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత మళ్లీ చిరంజీవి గారితో సినిమా చేయాలని భావించామని చిరంజీవి గారు నేను, సుధాకర్, హరిప్రసాద్ కలిసి యముడికి మొగుడు సినిమా తీశామని ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచిందని తెలిపారు.
రాజ్ కోటికి లైఫ్ ఇచ్చిన సినిమా అదేనని ఆయన పేర్కొన్నారు.
ఆ తర్వాత చిరంజీవితో కలిసి తీస్తేనే ఆ బ్యానర్ పై సినిమా తీయాలని భావించామని నారాయణ రావు అన్నారు.యముడికి మొగుడు సినిమాకు కోటీ 5 లక్షల రూపాయల బడ్జెట్ వేసుకుంటే కోటీ 15 లక్షల రూపాయల బడ్జెట్ అయిందని లాభం తగ్గడంతో చిరంజీవి గారు తలా 5 లక్షల రూపాయలు మీకు మిగిలేలా చూసుకుంటానని చెప్పారని నారాయణ రావు వెల్లడించారు.
అల్లు అరవింద్ గారు నెగిటివ్ చిరంజీవి, సురేఖ పేర్లపై ఇచ్చి తలా 5 లక్షల రూపాయలు చిరంజీవి నుంచి తీసుకోవాలని చెప్పగా మేము ఆ విధంగానే చేశామని నారాయణరావు కామెంట్లు చేశారు.అనుకున్నది అనుకున్న విధంగా చిరంజీవి మాకు చేశారని ఆయన పేర్కొన్నారు.నారాయణ రావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.