అధిక బరువు ఉన్నామని బాధపడుతున్నారా? పెరిగిన బరువును ఎలా తగ్గించుకోలా అని ఆలోచిస్తున్నారా? అయితే అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని రోజు మార్నింగ్ తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే కేవలం కొద్ది రోజుల్లోనే సన్నగా మల్లెతీగలా మారతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ ను వేసి వేయించుకోవాలి.
అలాగే ఒక గిన్నెలో ఐదు బాదం పప్పులు, రెండు వాల్ నట్స్ వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే ఒక యాపిల్ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న ఓట్స్, కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, పొట్టు తొలగించిన బాదం, వాల్ నట్స్, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఆఫ్ టేబుల్ మునగాకు పొడి, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్దమవుతుంది.
ఈ స్మూతీ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ స్మూతీని రోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే అతి ఆకలి దూరం అవుతుంది.చిరు తిండ్ల పై మనసు మల్లకుండా ఉంటుంది.అదే సమయంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా బరువు తగ్గుతారు.ఫలితంగా లావుగా ఉన్న మీరు కొద్ది రోజుల్లో సన్నబడతారు.
కాబట్టి అధిక బరువుతో సతమతమం అయ్యే వారు ఖచ్చితంగా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.