దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.ఈ మేరకు నిందితులను ఐదు రోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిని ఇచ్చింది.
ఈ నేపథ్యంలో బోయినపల్లి అభిషేక్ రావుతో పాటు విజయ్ నాయర్ లను ఐదు రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారించనుందని తెలుస్తోంది.
ఈడీ కస్టడీలో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు అనుమతి ఇచ్చింది.మరోవైపు లిక్కర్ స్కాం కేసులో అభిషేక్ రావు, విజయ్ నాయర్ లకు బెయిల్ మంజూరైంది.రూ.2 లక్షల పూచీకత్తుపై సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.