తెలుగు సినీ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయ విషయంలో ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తున్నాడు.ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో తాడేపల్లి నుంచి ఇప్పటం అనే గ్రామానికి వెళ్తున్న క్రమంలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటం అనే గ్రామంలో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు నెపంతో జనసేన మద్దతుదారుల ఇళ్లు కూలగొడుతుందని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కారు మీద కూర్చుని ప్రయాణిస్తూ వెళ్లారు.
కాగా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరమైన విషయం తెలిసిందే.
ఈ విషయం పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయలేదు కానీ ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కంప్లైంట్ చేయకాగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధినేత ఇలా కారు మీద కూర్చుని ప్రయాణిస్తూ అతివేగంతో వెళుతూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కూతురు ఆద్య కూడా అదేవిదంగా కారు ఓపెన్ చేసుకుని కారు సన్రూఫ్ ఓపెన్ మంచి స్పీడ్ లో ఉండగా నిలబడి ఆస్వాదిస్తున్నట్లుగా ఉన్న వీడియోను షేర్ చేసింది.ఈ వీడియోని చూసిన కొందరు నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తుంటే ఇంకొందరు మాత్రం నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.తండ్రిని ఫాలో అవుతూ ఇలా రోడ్డు ఎక్కావా అంటూ కామెంట్ చేస్తున్నారు.
అలాగే ఇలా చేయడం చట్టరీత్యా నేరమని కొందరు కామెంట్ చేస్తున్నారు.







