సినీ ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం.అయితే సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదాను దక్కించుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ఎన్నో కష్టాలను అవమానాలను సక్సెస్ ను ఫెయిల్యూర్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొంతమందికి ఎంత కష్టపడినా కూడా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు అన్నది దక్కదు.
మరి కొంతమందికి ఏంటి ఇవ్వడంతోనే రెండు మూడు సినిమాలలో నటించిన చాలు భారీగా క్రేజ్ వస్తూ ఉంటుంది.ఇకపోతే హీరోయిన్ ల విషయానికి వస్తే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలను ఆరబోస్తూ ఉంటారు.
సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తే తమ టార్గెట్ ని రీచ్ అవుతారు.అయితే ఇది నిజమే అంటుంది హీరోయిన్ పూనమ్ బజ్వా.
ఈ పంజాబీ ముద్దుగుమ్మ మొదటి సినిమా అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ,తమిళ,మలయాళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ఇకపోతే పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో తన అందాలతో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ సోషల్ మీడియాలో బోల్డ్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తే వాటి ద్వారా వచ్చే డబ్బులు ప్రతినెల ఈఎంఇ లు కట్టుకోగలను అంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.నటి పూనం బజ్వా కూడా ఈ విధంగానే చేస్తోంది కాబోలు.
నట్టి నటరాజ్ హీరోగా నటించిన గురుమూర్తి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది పూనమ్ బజ్వా.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.సందర్భంగా ఆమె మాట్లాడుతూ.2019లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నేను ఇన్నేళ్లపాటు హీరోయిన్ గా కొనసాగడం చాలా సంతోషంగా ఉంది.
నేను కుటుంబ కథా సినిమాలలో నటించాను కానీ గ్లామరస్ రూల్స్ లో నటించే అవకాశం రాలేదు అని తెలిపింది పూనమ్ బజ్వా.సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలపై స్పందించిన ఆమె తనకు దక్షిణాది నుంచి విపరీతమైన ఫేస్బుక్ ఫాన్స్ ఉన్నారని, వారందరూ తనను ఇలా గ్లామరస్ గా చూడటానికి ఇష్టపడుతున్నారు అని చెప్పుకొచ్చింది.తన గ్లామరస్ ఫోటోలను చూసి ఎంజాయ్ చేస్తున్న కారణంగానే తాను ఆ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.అంతేకాకుండా గ్లామర్ షోకి స్క్రీన్ షోకి తేడా ఉందని పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలేదు అనే ఆమె తెలిపింది.
ఇప్పటివరకు తాను అసలు స్కిన్ షోనే చేయలేదని అని తెలిపింది.అలాగే గ్లామర్ షో కి స్కిన్ షో కి మధ్య దూరాన్ని ఎవరూ తగ్గించలేరు ఈ రెండింటికీ పెద్ద దూరం ఏమీ లేదు అని ఆమె తెలిపింది.