ఈ ఒక్కటి డైట్ లో ఉంటే వేసవిలో డీహైడ్రేషన్ కు దూరంగా ఉండొచ్చు.. తెలుసా?

ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో ఎండల ప్రభావం వల్ల చాలా మంది డీహైడ్రేషన్( Dehydration ) బారిన పడుతుంటారు.

 Best Drink To Avoid Dehydration In Summer! Summer, Dehydration, Body Hydration D-TeluguStop.com

అంటే శరీరంలో నీటి శాతం మొత్తం క్షీణించిపోవ‌డం.ఇదేమి అనుకున్నంత చిన్న సమస్య కాదు.

దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు గా మారుతుంది.డీహైడ్రేషన్ కారణంగా నీరసం, అలసట, కళ్ళు తిరగడం, తీవ్రమైన త‌ల‌నొప్పి, శక్తి మొత్తం కోల్పోయినట్టు అనిపించడం, విరేచనాలు, వాంతులు ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

డీహైడ్రేషన్ క్రమంగా కొనసాగితే మూత్రపిండాలు ఘోరంగా దెబ్బతింటాయి.

అందుకే ఈ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు.

అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే వేసవిలో డీహైడ్రేషన్ కు దూరంగా ఉండవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కీరా దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి పీల్‌ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Tips, Latest-Telugu Health

ఆ తర్వాత రెండు ఉసిరికాయలు( amla ) తీసుకుని వాటర్ తో కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేయాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో చిటికెడు పింక్ సాల్ట్ ( Pink salt )ను కలిపి సేవించాలి.రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతిరోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ఈ డ్రింక్ ను రోజూ తాగితే డీహైడ్రేషన్ అన్న మాటే అనరు.

Telugu Tips, Latest-Telugu Health

అలాగే వేసవిలో ఈ డ్రింక్ ను తాగితే శరీరంలో అధిక వేడి మొత్తం తొలగిపోతుంది.తలనొప్పి, నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ డ్రింక్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

అది మీ ఇమ్యూనిటీ సిస్టమ్‌ ను స్ట్రాంగ్ గా మార్చేందుకు ఉత్తమంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube