సమంత హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర లో నటించిన యశోద సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సరోగసి నేపథ్యం లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు మొదటి నుండి భారీగా ఉన్నాయి.
సమంత భారీ యాక్షన్ సన్నివేశాలను ఏ సినిమా కోసం చేసిందని కొత్త కాన్సెప్ట్ అవ్వడం తో కాస్త కష్టమైన కూడా సమంత ఈ సినిమా ను చేసిందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి అనడం లో సందేహం లేదు.తాజాగా ప్రేక్షకుల ముందు కూర్చున్న ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది.
ఈ స్పందన తో కచ్చితం గా సినిమా అనుకున్న స్థాయి కలెక్షన్స్ నమోదు చేయలేక పోవచ్చు అంటూ చాలా మంది భావిస్తున్నారు.
ఈ సమయం లోనే సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన అప్డేట్ రావడం అందరిని ఆశ్చర్యానికే గురి చేస్తుంది.
ఈ సినిమా లో నాలుగు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.మీడియా సర్కిల్స్ వారు కూడా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ను కొనుగోలు చేసిందని బలంగా చెప్తున్నారు.
అంతే కాకుండా నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇటీవల సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇంతలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన అప్డేట్ రావడం తో థియేటర్లోకి ఎవరు వెళ్తారు అంటూ నిర్మాతలు తల పట్టుకున్నారట.సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా ఏడు కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది.
మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 10 నుండి 12 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా పాతిక కోట్ల రూపాయల కలెక్షన్ నమోదు చేయడం గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది.