Puttaparti Saibaba Sr NTR: పుట్టపర్తి సాయిబాబాపై కోర్టుకు వెళ్లిన ఎన్టీఆర్.. ఈ వివాదం గురించి తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ పుట్టపర్తి సాయిబాబా మధ్య గొడవలు జరిగాయని చాలా మందికి తెలుసు.ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని హిట్ సినిమాలలో కోడలు దిద్దిన కాపురం సినిమా కూడా ఒకటి.

 Shocking Facts About Puttaparti Saibaba Sr Ntr Issues Details, Puttaparti Saibab-TeluguStop.com

డి.యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలోని సత్యనారాయణ పాత్ర పుట్టపర్తి సాయిబాబాను పోలి ఉంటుంది.

పుట్టపర్తి సాయిబాబా హెయిర్ స్టైల్, క్యాస్టూమ్స్ ఏ విధంగా ఉంటాయో ఈ సినిమాలో సత్యనారాయణ క్యాస్టూమ్స్, స్టైల్ అదే విధంగా ఉంటాయి.

ఈ సినిమాలో సత్యనారాయణ పాత్రను కొంతమేర నెగిటివ్ షేడ్స్ తో చూపించడం గమనార్హం.ఆ సమయంలో కొంతమంది పుట్టపుర్తి సాయిబాబా భక్తులు ఈ సినిమా రిలీజ్ కాకుండా చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు.

సెన్సార్ బోర్డ్ సభ్యులు సైతం ఈ సినిమా రిలీజ్ కు అడ్డుపడ్డారు.

Telugu Kodaludiddina, Nandamuritaraka, Puttahi Saibaba, Puttaisaibaba, Satyanara

ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ సొంత సినిమా కాగా ఆయన కోర్టుకు వెళ్లి నరసరాజు గారి సూచనల ప్రకారం పుట్టపర్తి సాయిబాబాను ఈ పాత్ర పోలి ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నించాడని సమాచారం.సత్యనారాయణ పాత్ర విగ్గు మాయల ఫకీర్ విగ్గు అని ఎన్టీఆర్ చెప్పడం గమనార్హం.మేం మాయల ఫకీర్ జుట్టు తీసుకున్నామని ఎన్టీఆర్ చెప్పాడని చివరకు కేసు కొట్టేసారని తెలుస్తోంది.

Telugu Kodaludiddina, Nandamuritaraka, Puttahi Saibaba, Puttaisaibaba, Satyanara

సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.కోడలు దిద్దిన కాపురం ఎన్టీఆర్ 200వ సినిమా కావడం గమనార్హం.అప్పట్లో సాయిబాబా భక్తులు వచ్చినా సమాధానం చెప్పగలనని సీనియర్ ఎన్టీఆర్ చెప్పారని బోగట్టా.మూఢ నమ్మకాలకు సీనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకంగా ఉండేవారని సమాచారం.సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత కూడా పుట్టపర్తి సాయిబాబాను కలవలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube