Arjun Sarja :యాక్షన్ కింగ్ అర్జున్ కి ఎంత ప్రాపర్టీ ఉందో తెలుసా ?

అర్జున్ సర్జా.మా పల్లెలో గోపాలుడు సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు.

 Action King Arjun Property Details, Arjun Sarja, Maa Pallelo Gopaludu, Kannadig-TeluguStop.com

అప్పటికే పలు కన్నడ సినిమాలతో మంచి నటుడు అనిపించుకున్నాడు.పుట్టి పెరిగింది అంత కన్నడిగుడిగానే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో మంచి పెట్టు ఉన్న నటుడు.

కేవలం నటుడిగానే కాదు.వ్యక్తిత్వంలో కూడా ఎంతో ఎత్తున ఉండే మనిషి.

ఎవరితోనూ విభేదాలు పెట్టుకోడు.హీరోలు సైతం మెచ్చిన నటుడిగా, సౌమ్యుడిగా అతడికి మంచి పేరు ఉంది.

ఇక అర్జున్ సర్జా తండ్రి కూడా నటుడు కావడం తో అతడు నటుడు అవ్వలేదు.అర్జున్ కి పోలీస్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది.

అతడి అన్న కిషోర్ సర్జా సినిమా డైరెక్టర్.

అయితే అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చాడు.

  అర్జున్ నివేదిత అనే ఒక హీరోయిన్ ని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.పెద్ద అమ్మాయి ఐశ్వర్య సైతం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత తండ్రి ఇచ్చిన ఆస్తులతో పాటు అయన కూడా బాగానే కూడబెట్టాడు.అర్జున్ హనుమాన్ భక్తుడు అందుకే 35 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం తో ఒక హనుమాన్ గుడిని కట్టిస్తున్నాడు.

కెరీర్ మొత్తం మీద 150 కి పైగా సినిమాల్లో నటించిన అర్జున్ ఎంత ఆస్తి సంపాదించాడో చూద్దాం.

Telugu Aishwarya, Arjun Sarja, Arjun, Kannadigas, Kishore Sarja, Maapallelo, Naa

సింహడా మరి సైన్య అనే సినిమాలో మొదటగా నటించగా ఆ సినిమా కోసం 30 వేల రూపాయల పారితోషకం అందుకొని నేడు ఒక్కో సినిమా కోసం 7 నుంచి 8 కోట్ల రూపాయలను అందుకుంటున్నాడు.నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలను తీసుకున్నాడు.ఇక అతడి గ్యారేజ్ లో 5 లక్సరీ కార్స్ ఉన్నాయ్.

పోర్షే కేయెన్నే, బిఏండబ్ల్యూ X5, ఫోర్డ్ ఎండేవార్, మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ మెబాక్, టొయోట ఫార్చూనర్ వంటి కార్స్ ఉన్నాయ్.వీటి అన్నిటి ఖరీదు దాదాపు 5 కోట్ల వరకు ఉంటుంది.

ఇక మధుగిరి కర్ణాటక లో ఆయనకు 15 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది.ఇక తన భార్య, కూతుళ్ళ పేర్ల మీద కాకుండానే అయన టోటల్ ప్రాపర్టీ మూడు వందల కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube