యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జాతకం చూసిన జ్యోతిష్కులు తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రముఖ జ్యోతిష్కుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశంకు నాయకుడు మారబోతున్నాడని తెలిపారు.
కొన్ని కీలక మార్పులు చేస్తేనే ఆ పార్టీకి ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని జ్యోతిష్కుడు వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని కచ్చితంగా చెప్పగలనని తెలిపారు.
మూడు సంవత్సరాల తర్వాత తారక్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని కామెంట్లు చేశారు.గతంలో తారక్ ఎన్నికల ప్రచారం చేశారని రాబోయే రోజుల్లో తారక్ టీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశం అయితే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు జాతకం ప్రకారం కూడా అధ్యక్షుని స్థానంలో మరో వ్యక్తి వచ్చే అవకాశం అయితే ఉందని ఆయన పేర్కొన్నారు.
వీరబ్రహ్మేంద్రస్వామి సినిమాల్లో సక్సెస్ అయిన వాళ్లు రాజకీయాల్లో సక్సెస్ అవుతారని చెప్పారని ఆయన వెల్లడించారు.
తారక్ రాజకీయాల్లోకి వస్తారని సంచలనాలు సృష్టించే ఛాన్స్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.అయితే తారక్ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.
తారక్ ప్రస్తుతం సినిమా కెరీర్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం గమనార్హం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.తారక్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యారు.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలుకానుంది.
ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయి.