దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం కొనసాగుతోంది.ఈ క్రమంలో సాయంత్రం 6.27 గంటలకు గ్రహణం ముగియనుంది.గరిష్టంగా గంట 45 నిమిషాల పాటు గ్రహణం ఏర్పడనుంది.22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఏర్పడిందని చెబుతున్నారు.ఒకే కక్ష్యలోకి సూర్యుడు, చంద్రుడు, భూమి రాగా.
చంద్రుడి నీడ భూమిపై పడటంతో సూర్యగ్రహణం ఏర్పడింది.తెలుగు రాష్ట్రాల్లో 49 నిమిషాల పాటు గ్రహణం కనిపించనుంది.
దీంతో పిల్లలు, పెద్దలు గ్రహణం చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
మరోవైపు కొందరు గ్రహణం చూస్తే సమస్యలు ఎదుర్కొంటారని చెబుతుండటంతో వెనకడుగు వేస్తున్నారు.
అయితే శాస్త్రవేత్తలు ఇలాంటి అపోహాలను నమ్మొద్దని సూచిస్తున్నారు.దీనిలో భాగంగానే హైదరాబాద్ లోని ఓయూలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నారు.
గ్రహణ సమయంలో భోజనం చేయకూడదనే అపోహాలను తొలగిస్తూ సామూహిక భోజనాలు నిర్వహించారు.అదేవిధంగా గ్రహణానికి, చిన్నారులకు వచ్చే మొర్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.