బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో కత్రినా కైఫ్ ఒకరు.ఈమె వరుస సినిమాలు చేసి స్టార్ స్టేటస్ అందుకుంది.
స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.ఇక తెలుగులో సైతం ఈ భామ మెప్పించింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమాలో ఈయనకు జోడీగా కత్రినా నటించి మల్లీశ్వరిగా ఇప్పటికి ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయింది.ఈ సినిమా 2004లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమా తర్వాత కత్రినా 2005లో బాలయ్య తో అల్లరి పిడుగు సినిమా చేయగా అది ప్లాప్ అయ్యింది.దీంతో ఈమె మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు.
ఇక ఈమె మలయాళంలో కూడా నటించింది.అయితే బాలీవుడ్ స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత ఈమె మళ్ళీ సౌత్ వైపు తిరిగి చూడలేదు.
కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సౌత్ లో నటించేందుకు సిద్ధం అయ్యింది.
ప్రెజెంట్ ఈ బ్యూటీ నటించిన ఫోన్ భూత్ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
నవంబర్ 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.దీంతో చిత్ర యూనిట్ వరుస ప్రొమోషన్స్ చేస్తుంది.
ఈ నేపథ్యంలోనే వరుస ప్రొమోషన్స్ చేస్తూ.కత్రినా కూడా బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా కత్రినా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
ఈమె సౌత్ ఇండస్ట్రీపై పొన్నియన్ సెల్వన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.ఈమె ఈ సినిమాలోని ఐశ్వర్య రాయ్ పాత్రపై ప్రశంసలు కురిపిస్తూనే ఇంత అద్భుతమైన సినిమా చూడలేదని ఈ సినిమాపై కూడా కామెంట్స్ చేసింది.అలాగే సౌత్ ఇండస్ట్రీపై కూడా తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది.
తనకు భాషతో సంబంధం లేదని.మంచి కథతో వస్తే సౌత్ లో కూడా సినిమాలు చేయడానికి తాను ఎప్పుడు సిద్ధమే అని తెలిపింది.
దీంతో ఈమె చూపు కూడా సౌత్ సినిమాలపై పడింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరి సౌత్ వారు ఈమెను పట్టించు కుంటారో లేదో చూడాలి.