సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఒక చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది.మరి ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రేమ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే అందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి అని చెప్పవచ్చు.అయితే వెండితెర సంబంధించిన వార్తలే కాకుండా బుల్లితెర సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.
ఈ మధ్యకాలంలో బుల్లితెర సెలబ్రెటీలకు సంబంధించిన ఎఫైర్ల విషయాల గురించి కూడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీకి వార్త ఒకటి చెక్కర్లు కొడుతోంది.
ఆమె మరెవరో కాదు అర్చన అనంత్. అర్చన అనంత్ అంటే బుల్లితెర పేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్ సౌందర్య అంటే చాలా ఇట్టే గుర్తుపట్టేస్తారు.
కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ సీరియల్గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సీరియల్ లో వంటలక్క,డాక్టర్ బాబు,మోనిత క్యారెక్టర్లు ఎంత ఫేమస్ అయ్యాయో అందులో సౌందర్య పాత్ర కూడా అంతే ఫేమస్ అయ్యింది.ఆమె అసలు పేరు కంటే క్యారెక్టర్ నేమ్ చెబితేనే చాలామంది గుర్తు పడుతూ ఉంటారు.అంతేకాకుండా గ్లామరస్ అత్తగా ఆ సీరియల్ తో సరికొత్త ట్రెండును సెట్ చేసింది సౌందర్య.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన అర్చన అనంత్ కార్తీకదీపం సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత కేరాఫ్ అనసూయలో కూడా ముఖ్యపాత్రలో నటిస్తోంది.ఇది ఇలా ఉంటే అర్చన అనంత్ తన భర్త పిల్లలను పెట్టుకొని కూడా ఇండస్ట్రీకి చెందిన ఒక ముసలోడితో ఎఫైర్ నడుపుతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కానీ ఈ విషయంపై అర్చన అనంత్ స్పందించలేదు.ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే అర్చన అనంత్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.