బిగ్ బాస్ 8వ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్లే?

తెలుగు తెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం 7 వారాలను పూర్తి చేసుకొని ఎనిమిదవ వారంలోకి అడుగు పెట్టింది.ఈ క్రమంలోనే ఇప్పటికే హౌస్ నుంచి ఏడు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాక 14 మంది హౌస్లో కొనసాగుతున్నారు.

 These Are The Contestants In Bigg Boss Week 8 Nomination, Contestants, Bigg Boss-TeluguStop.com

ఏడవ వారం అర్జున్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు.ఇక ఏడవ వారం పూర్తి కావడంతో ఎనిమిదవ వారం నామినేషన్ ప్రక్రియ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగింది.

ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లు ఎవరినైతే నామినేట్ చేయాలి అనుకుంటున్నారో వారు ఇద్దరి ఫోటోలను తీసుకెళ్లి మంటలో వేయాలి అంటూ సూచించారు.

ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా ఇతర కంటెస్టెంట్లను నామినేట్ చేస్తూ వారి ఫోటోలను మంటలో వేశారు.

ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి రోహిత్, రేవంత్, శ్రీహాన్, సూర్య, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజ్, మెరీనా, కీర్తి, వాసంతి, ఇనయ, గీతూ, ఫైమా, శ్రీ సత్య మొత్తం 14 మంది కంటెస్టెంట్లు కూడా ఈ వారం నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈవారం హౌస్ సభ్యులు మొత్తం నామినేషన్ లో ఉండగా ఎవరు సేఫ్ జోన్ లో ఉంటారు ఈవారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు అనే విషయం ఉత్కంఠత ఏర్పడింది.

Telugu Aadi Reddy, Baladitya, Bigg Boss, Faima, Geetu, Inaya, Keerthi, Marina, R

ఇకపోతే ఈ వారం నామినేషన్ లో భాగంగా సూర్య, ఇనయ మధ్య ఉన్నటువంటి రిలేషన్ కాస్త బ్రేక్ అయినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సూర్యతో ఇనయ మాట్లాడుతూ మనిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అయితే ఆ ఫ్రెండ్షిప్ బయటకు వేరే విధంగా ఎక్స్ ఫోజ్ అవుతుందని అందుకే నాగార్జున గారు తనను హెచ్చరించారని ఉద్దేశిస్తూ సూర్యతో తనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కూడా బ్రేక్ చేసుకుంది.ఇకపై తాను సూర్యను ఒక హౌస్ మేట్ గాని తాను భావిస్తానని ఈ సందర్భంగా ఇనయా సూర్యతో తన ఫ్రెండ్షిప్ కూడా బ్రేకప్ చెప్పుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube