మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది.
గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి.రాజకీయ పార్టీలతోపాటు మునుగోడు ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సైతం వెన్నులో వణుకు పడుతోంది.
ఎక్కడ ఎలాంటి తప్పులు జరగొద్దని ఎన్నికల అధికారులు కఠిన నిబంధనలు అమలు చేశారు.ఇప్పటికే విధులు నిర్లక్ష్యం వహించిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.
దీంతో అధికారుల్లో భయం పెరిగిపోయింది.ఎన్నికల్లో సరైన అవగాహన లేని ఇద్దరు అధికారులను విధుల నుంచి తప్పించింది.
అందుకే అధికారులు సైతం భయపడుతున్నారు.
తనకు లేని అధికారాలను ఉపయోగించి ఓ అధికారి ఓ అభ్యర్థికి కేటాయించిన గుర్తును ఛేంజ్ చేశాడు.
రోడ్డు రోలర్ గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించినందుకు మునుగోడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కేవీఎం జగన్నాథరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.అనంతరం కొత్త ఆర్‌ఓ అధికారిని నియమించింది.
విధులకు భంగం కలిగించిన జగన్నాథరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు.అలాగే చౌటుప్పల్ తహసీల్దార్ కూడా ఓ అభ్యర్థికి సంబంధించిన ఓడ గుర్తుకు బదులు పడవ గుర్తును ముద్రించేందుకు ప్రయత్నించారు.
దీంతో అతడిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి.ఈ క్రమంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యత స్వీకరించడానికి కూడా ఆసక్తి చూపడానికి భయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలంటేనే తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పని.అలాంటిది మునుగోడు ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే మించిన ఒత్తిడిని ఎదుర్కొవాల్సి ఉంటుంది.ఈ క్రమంలో అధికారుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.