అగ్ర దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు.ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరుతెచ్చుకున్న శంకర్ ఏ సినిమా చేసిన అది భారీ స్థాయిలోనే ఉంటుంది.
ఈయన సినిమాలకు అందుకే భారీ బడ్జెట్ ఉంటుంది.ప్రతీ సన్నివేశం, ప్రతీ పాట కు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిస్తాడు.
ఇక శంకర్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో పాటలకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు అనే విషయం ఆ సినిమాలోని పాటలను చూస్తేనే తెలుస్తుంది.
మరి ఈసారి కూడా శంకర్ ఒక భారీ బడ్జెట్ సినిమానే ఎంచుకున్నాడు.
మరి ఆ సినిమాలో హీరోగా మన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తీసుకున్నాడు.వీరిద్దరి కాంబోలో RC15 సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.
ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు.దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగి పోయాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా నవంబర్ రెండవ వారంలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకోబోతుంది.
దీంతో ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ ను తెరకెక్కించ బోతున్నారు అని సమాచారం.
ఈ సాంగ్ భారీ బడ్జెట్ తో చాలా గ్రాండియర్ లెవల్లో ప్లాన్ చేసాడట శంకర్.మరి ఈ సాంగ్ కోసం విదేశాల్లో పలు లొకేషన్స్ కూడా ఫిక్స్ చేరని.ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అవ్వనుందని టాక్.
మరో ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.
దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.