తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.మాజీ సీఎం జయలలిత మరణంపై విచారణ కమిటీ నివేదిక విడుదల చేసింది.
జస్టిస్ ఆర్ముగ స్వామి నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.మరణ సమయంలో జయలలితకు చిన్నమ్మ శశికళతో విభేదాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
అంతేకాకుండా వైద్యుల తీరును సైతం కమిటీ తప్పు పట్టినట్లు సమాచారం.జయలలిత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నిపుణులు సూచించినప్పటికీ యాంజియోప్లాస్టీ చేయలేదని నివేదికలో స్పష్టం చేశారు.
జయలలిత పరిస్థితిపై తప్పుడు ప్రకటనలు చేశారని, పరోక్షంగా జయ మృతికి శశికళే కారణమని నివేదికలో పొందుపర్చారు.కాగా ఈ నివేదికను తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లలో విడుదల చేసింది.
ఈ క్రమంలో శశికళతో పాటు అప్పటి చీఫ్ సెక్రటరీ డాక్టర్ రామ్ మోహన్ రావుపై చర్యలకు సిఫార్సు చేశారు.