కన్నడ కంఠీరవ కు ముగ్గురు కుమారులు.అయన ముగ్గురిని సినిమా ఇండస్ట్రీ కి తీసుకచ్చిన అందులో పెద్ద కొడుకు శివ రాజ్ కుమార్ మరియు చిన్న కొడుకు పునీత్ రాజ్ కుమార్ మాత్రమే సక్సెస్ అయ్యారు.
ఇక ఆ మధ్య కాలంలో పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో కాలం చేసిన విషయం మన అందరికి తెలిసిందే.ఇక శివన్న ని మరియు పునీత్ ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేయడనికి రాజ్ కుమార్ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
యాదృచ్చికంగా జరిగిందో లేక కావాలని చేసారో తెలియదు కానీ ఈ ఇద్దరు హీరోల పరిచయం తెలుగు దర్శకుల చేతిలోనే జరగడం విశేషం.
శివ రాజ్ కుమార్ ని తెలుగు లెజెండరీ దర్శకుడు అయినా సింగీతం శ్రీనివాస రావు చేతుల మీదుగా పరిచయం చేయించాడు.
ఇక పునీత్ రాజ్ కుమార్ ని పూరి జగన్నాథ్ కన్నడ ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.ఈ ఇద్దరు తమ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు.
ఇలా తెలుగు దర్శకుల చేతి మీదుగా పరిచయం చేయించడం వెనక రాజ్ కుమార్ దూర దృష్టి ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.ఒక వేళా కన్నడ పరిశ్రమలోనే ఒక పేరున్న దర్శకుడి చేతుల మీదుగా పరిచయం చేస్తే అంచనాలు బాగా పెరిగిపోతాయి.
ఇక కన్నడ దిగ్గజ హీరో రాజ్ కుమార్ కొడుకులు అంటే భారీ భారీ డైలాగ్స్, స్టార్ హీరోను మించి భారీ కథ కూడా తయారు చేస్తారు.
అందుకే ఎలాంటి అంచనాలు లేని, కన్నడ ప్రేక్షకులకు తెలియని దర్శకుడు అయితే ఎలాంటి భారీ అంచనాలు ఉండవు.ఇదొక అద్భుతమైన సక్సెస్ ఫార్ములా.దాంతో ఇద్దరు కొడుకుల లాంచింగ్ ఎంతో బాగా జరిగింది.
ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమలో ఈ ఇద్దరు హీరోలు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న వారే.పునీత్ మరణం వరకు వారు ఎంత మంచి హీరోలో అంతే మంచి సేవ గుణం కలిగిన వారు.
వీరిని కేవలం హీరోలుగా భావిస్తే పబ్లిసిటీ స్టంట్ అవుతుంది.కానీ రాజ్ కుమార్ కుటుంబం పై జనాల్లో ఎంతో మంచి అభిమానం ఉంది
.