కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
తనకు, థరూర్ కు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని తేల్చి చెప్పారు.థరూర్ తో తనకు ఎలాంటి సమస్యలు, విభేదాలు కూడా లేవని స్పష్టం చేశారు.
తాము ఇద్దరం అన్నదమ్ముల్లాంటి వాళ్లమని తెలిపారు.అయితే మరో నాలుగు రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి.
కాగా పార్టీలో పలువురు నేతలు ఖర్గే వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.