దుర్గాదేవి నిమజ్జనంలో ప్రమాదం.. ఏడుగురు మృతి ఎక్కడంటే..

మనదేశంలో దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవిని నవరాత్రులలో పూజించి నిమర్జనం చేస్తారు.ఇలా తొమ్మిది రోజులు ఎంతో కఠినమైన ఉపవాసాలు ఉండి భక్తితో భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.

 Accident In Durga Devi Immersion Seven People Died , Durga Devi Immersion, Jalpa-TeluguStop.com

దుర్గాదేవినీ నిమజ్జనం చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

జల్‌పైగురి మల్‌బజార్ వద్ద దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనం జరుగుతున్న సమయంలోనే మల్ నది ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించడంతో చూస్తుండగానే పదుల సంఖ్యలో జనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.వీరిలో ఇప్పటికే ఏడుగురు మృతి చెందినట్టుగా ఆ ప్రాంత అధికారులు తెలిపారు ఇంకా కొంతమంది ప్రజలు గాయపడగా, మరి కొంతమంది గల్లంతయిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

జల్‌పైగురిలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో విషాదం గురించి తెలుసుకున్న వెంటనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జి త్వరగా రెస్క్యూ ఫోర్స్‌ ను అక్కడికి పంపించి సహాయ కార్యక్రమాలు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.రాత్రి వేళ కావడం తో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పదుల సంఖ్యలో భక్తుల ఆచూకీ గల్లంతవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ శాఖ వెల్లడించింది.

అయితే ఇలాంటి పవిత్రమైన పండుగ సమయాలలో దుర్గాదేవి నిమజ్జనం జరుగుతుండగా ఇలా జరగడం ఎంతో బాధాకరమని అక్కడి స్థానికులు చెబుతున్నారు.ఇవే కాకుండా వినాయకుని నిమర్జనాలలో కూడా చాలా ప్రదేశాలలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

https://twitter.com/Vikram_Tub/status/1577705657817784320?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1577705657817784320%7Ctwgr%5E438604785f607ff275438ebdfc478b2459dc0ee5%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube