తెలంగాణలో మరో వారం పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.