కుప్పం వేదికగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నాయకుు ధూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు.జగన్ హిట్లర్ వారసుడని.
పగ, దోపిడీ, విద్వేషం, విధ్వంసంలో హిట్లర్ ను మించిపోయారని విమర్శించారు.ప్రతి ఊరిలో ఆయనకు ప్యాలెస్ ఉండాలని అందుకు అనేక భూములు అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి రాదని చిన్న పిల్లాడిని అడిగిన చెప్తారన్నారు.గెలిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తానంటున్నారు.
రేపు ముఖ్యమంత్రివి అవుతావనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.