కుక్కలకి మనుషులకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది.విశ్వాసం చూపించడంలో వాటికవే సాటి అని చెప్పుకోవాలి.
మనుషులకు త్వరగా మచ్చికయ్యే వీటిని పెంచుకునేందుకు మనలో అనేకమంది ఆసక్తి చూపిస్తుంటారు.అన్ని జంతువులతో పోలిస్తే కుక్కలు చాలా తొందరంగా మనుషులకు అలవాటు పడతాయి.
చాలామంది వాటిని సొంత కుటుంబ సభ్యుల్లానే భావిస్తారు.వాటితో ఆడుకోవడం, కలిసి పని చేయం, వాకింగ్ కు తీసుకువెళ్లడం వంటివి చేస్తుంటారు.
అవి చేసే ప్రతి చిన్న చిలిపి పనిని ఆస్వాదిస్తుంటారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.
అయితే దానికి మరో ఉదాహరణగా నిలుస్తోంది ఓ వీడియో.ఈ వీడియోని నెటిజన్లు ఎంతో ఇష్టపడుతున్నారు.సాధారణంగా కుక్కలు మనుషులతో కలిసి పార్కులో, నీటిలో ఆడుకునేందుకు ఇష్టపడతాయి.వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన తర్వాత, ఇక్కడున్న శునకం ఎంత సంతోషంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తోటలోని స్ప్రింక్లర్ ముందు తన కేరింతలు చూస్తే చిన్నపిల్లల్ని చూసినట్టే వుంది.అవును, వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుక్క సరదాగా స్ప్రింక్లర్ ముందు ఆడుకోవడాన్ని చూడవచ్చు.
ఒక గార్డెన్లో ఒక పువ్వు లాంటి స్ప్రింక్లర్, దాని నుంచి వచ్చే నీరు వివిధ దిశలలో వస్తుంది.ఇది చూసిన డాగీ దాని వెంట పరిగెత్తుతూ, దాని చుట్టూ తిరుగుతూ సంతోషంగా గంతులేస్తోంది.ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.కాగా కొద్ది సమయంలోనే ఇది వైరల్ గా మారడం విశేషం.ఇప్పటి వరకు ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.
ఈ కుక్కతో ప్రేమలో పడ్డానని ఒకరంటే, నా మనసు కూడా ఇలాగే డాగీతో ఆడాలని ప్రయత్నిస్తోంది అని మరో యూజర్ రాశారు.ఇంకో యూజర్ నాకు మెడిటేషన్ అవసరం లేదు ఇపుడు.
అని కామెంట్ చేయడం మనం గమనించవచ్చు.