సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కెనడాలో టొరంటో ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన ఆయన మాట్లాడారు.
ఆర్ఆర్ఆర్ ఎంత ఘన విజయం సాధించినా.తను దర్శకునిగా తొలి మెట్టుపైనే ఉన్నానన్నారు.
మూలాలకు కట్టుబడి ఉన్నానన్న ఆయన.తనని తాను చక్కదిద్దుకోవాల్సి ఉందని చెప్పారు.ఇంకా నేర్చుకోనే దశలోనే ఉన్నానని స్పష్టం చేశారు.తన శైలితో హాలీవుడ్ తరహా సినిమా చేస్తే, రెండు పడవలపై కాళ్లు ఉంచి ప్రయాణం చేసినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు.