టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఒకానొక సమయంలో వరుసగా సినిమాలను చేసేవాడు.ఏడాదికి ఐదారు సినిమాలు ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయి.
మొన్నటి వరకు కూడా మూడు నాలుగు సినిమాలు ఒకేసారి చేసిన ఘనత వెంకటేష్ కి దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి వెంకటేష్ ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తున్నాడు.
వరుసగా తన వద్దకు వస్తున్న కథలను వెనక్కు తిప్పి పంపిస్తూ తనకు సెట్ అవ్వవు అంటూ కొత్త కథలను తీసుకురావాలంటూ రచయితలకు మరియు దర్శకులకు సూచిస్తున్నాడట.ఇప్పటికే పదుల కొద్ది కథలు విన్న వెంకటేష్ ఇంకా కథల కోసం వెయిట్ చేస్తూనే కొత్త సినిమాకు కమిట్ అవ్వకుండా సమయం వృధా చేస్తున్నాడంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించేందుకు వెంకటేష్ ఓకే చెప్పాడు అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి.ఇక సల్మాన్ ఖాన్ హిందీలో నటిస్తున్న ఒక సినిమాలో పూజా హెగ్డే కి అన్న పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇలా గెస్ట్ పాత్రలోనే వెంకటేష్ నటించడం తప్పితే తన కొత్త సినిమాను మొదలు పెట్టడం లేదు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే మీడియాలో వెంకటేష్ తదుపరి సినిమా గురించి చర్చ జరుగుతోంది.
మలయాళం లో దృశ్యం 3 సినిమా తాజాగా పట్టాలెక్కిన విషయం తెలిసిందే.మోహన్ లాల్ గతంలో నటించిన దృశ్యం 1 మరియు దృశ్యం 2 సినిమాలను వెంకటేష్ రీమేక్ చేశాడు.అక్కడ సక్సెస్ అయినట్లుగానే ఇక్కడ కూడా సక్సెస్ అయ్యాయి.కనుక దృశ్యం 3 సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు వెంటనే ఇక్కడ కూడా రీమేక్ చేసేందుకు వెంకటేష్ ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఉన్నాడు అంటున్నారు.
రీమేక్ లు చేయాలి అనే ఉద్దేశం తప్పితే వెంకటేష్ కొత్త కథతో సినిమా చేయాలనే ఆలోచన లేనట్లుగా ఉంది అంటూ కొందరు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.ఈ విషయమై వెంకటేష్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.