చిరంజీవి నటుడు కాదంబరి కిరణ్ ను దూరం పెట్టారా.. ఏం జరిగిందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన కాదంబరి కిరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.శివాజీరాజాకు నాకు మధ్య గ్యాప్ ఉండాలని ఆ గ్యాప్ ఉంటే మాత్రమే మంచిదని కాదంబరి కిరణ్ అన్నారు.

 Chiranjeevi Avoid Kadambari Kiran Details Here Goes Viral , Chiranjeevi, Kadamb-TeluguStop.com

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అంటే అందరికీ చిరాకు వచ్చిందని కాదంబరి కిరణ్ అన్నారు.రాజేంద్ర ప్రసాద్ కు సపోర్ట్ చేసి ఇండస్ట్రీలో పెద్దలకు సపోర్ట్ చేసి బ్యాడ్ అయ్యానని ఆయన అన్నారు.

ఇలాంటి ఘటనల వల్ల మనం సైతం దిశగా అడుగులు పడ్డాయని కాదంబరి కిరణ్ అన్నారు.నన్ను అవమానించే హక్కు అమ్మ, నాన్న, దైవం, నా నిర్మాతలకు ఉందని ఇంకెవరికీ లేదని ఆయన అన్నారు.

నాగార్జున గారితో తీయాలని అనుకున్న బావ సినిమా విధిరాత వల్లే ఆగిపోయిందని అంతకు మించి మరే కారణం లేదని కాదంబరి కిరణ్ అన్నారు.రమ్యకృష్ణ గారితో, సిమ్రాన్ గారితో ప్లాన్ చేసిన సినిమాలు కూడా వర్కౌట్ కాలేదని కాదంబరి కిరణ్ తెలిపారు.

రమ్యకృష్ణగారు చాలా మంచి వ్యక్తి అని రమ్యకృష్ణ నన్ను ఎంతగానో గౌరవిస్తారని కాదంబరి కిరణ్ అన్నారు.నాగార్జున గారికి పల్లెటూరి టైటిల్స్ అంటే ఎంతగానో నచ్చుతాయని ఆయన కామెంట్లు చేశారు.

నాగార్జునను ఇండస్ట్రీలో చినబాబు అని పిలుస్తారని ఆయన చెప్పుకొచ్చారు.నేను విధిరాతను ఎక్కువగా నమ్ముతానని ఆయన తెలిపారు.

చిరంజీవి గారి సినిమాలలో ఒక్క సినిమాలో కూడా నేను నటించలేదని ఆయన అన్నారు.

Telugu Chinababu, Chiranjeevi, Kadambari Kiran, Nagarjuna, Ramya Krishna, Simran

చిరంజీవి గారిని నేను ఎంతగానో ఆరాధిస్తానని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవి గారు నన్ను దూరం పెట్టలేదని ఆయనతో ఉన్న కొంతమంది వల్ల నన్ను దూరంగా ఉండాల్సి వచ్చిందని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు.ఎన్నికలలో నేను ప్రభావం చూపుతానని మరో వ్యక్తి వెనుక నేను ఉన్నానని ప్రచారం చేశారని కాదంబరి కిరణ్ అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube