యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను.ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
ఇటీవలే బోయపాటి బాలయ్యతో తీసిన అఖండ సినిమాతో ఘన విజయం అందుకుని మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు.
రామ్ అయితే తన ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడు.ఎందుకంటే ఇటీవలే రామ్ లింగుస్వామి దర్శకత్వంలో చేసిన ‘ది వారియర్’ సినిమా విజయం సాధించలేదు.
పైగా ఈ సినిమాతో రామ్ తమిళ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా పాగా వేయాలని చూసినా ఆయన అనుకున్నది జరగలేదు.
అందుకే ఇప్పుడు బోయపాటి తో తీసే సినిమా భారీ విజయం ఇచ్చి పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ఆశ పడుతున్నాడు.
ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా టాక్ బయటకు వచ్చింది.
ఇక తాజాగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది.వీరు ముగ్గురికి సంబందించిన పిక్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మరి థమన్, బోయపాటి అఖండ సినిమాతో కలిసి పని చేసి భారీ విజయం అందుకున్నారు.ఇక ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.ఇక రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.