ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకునేలా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.
జిల్లాలో కొనసాగుతున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో స్దానిక పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… వినాయక నవరాత్రి వేడుకవల మండపాలతో సహా ఇతర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పెర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేను ఏర్పాటు చేయరాదని, నిభందనలపై మండపం నిర్వహుకులు, కమిటీలకు SHO లు వివరించి చెప్పాలని సూచించారు.
గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలని,భక్తుల సందర్శను దృష్టిలో వుంచుకోని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలని సూచించారు.
మండపాల్లో షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించేలా చోరవ తీసుకొవాలని, గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి గణేష్ మండపం దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ అధికారుల తనిఖీ వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని తెలిపారు.
వినాక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచడం.
పోలీసుధికారులు సందర్శించడంతో పాటు ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు.
మీ పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్ విగ్రహాలు, మండపం నిర్వహుకులు కమిటీ వివరాలు, విధ్యుత్ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొవాలని ఆదేశించారు.
గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన పోలీసులతో బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు, స్విమర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.అదేవిధంగా నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.