రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే.సినిమా విడుదల విషయం లో మొదట కొంత హంగామా నడిచింది.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ సినిమా లైగర్ ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారని.కరోనా వల్ల థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి.
సినిమా ను దాదాపుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా ను రూపొందించిన విషయం తెల్సిందే.సినిమా కు ఉన్న విపరీతమైన బజ్ మరియు ఇతర హైప్ నేపథ్యం లో సినిమా ను ఓటీటీ ద్వారా డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు ఇస్తే 150 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సిద్ధం అంటూ ప్రముఖ ఓటీటీ డీల్ ఆఫర్ చేసిందట.
కానీ పూరి మరియు ఛార్మీ మాత్రం బాబోయ్ మా సినిమా తోపు సినిమా.మేము ఖచ్చితంగా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం లేదు.
థియేటర్ రిలీజ్ కు వెళ్తాం.
మూడు నాలుగు వందల కోట్ల వసూళ్లు మాకు నమోదు అవ్వడం ఖాయం.
కనుక మేము ఎందుకు ఓటీటీ కి ఇవ్వాలి అంటూ వారు ఆ సమయంలో చాలా ధీమా గా ఉన్నారట.ఒక వేళ సినిమా ని ఓటీ టీ డైరెక్ట్ స్ట్రీమింగ్ కు ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
సినిమా ను ఓటీటీకి ఇచ్చి ఉంటే పూరి కనీసం పాతిక కోట్ల వరకు లాభంను దక్కించుకునేవాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక వేళ విజయ్ దేవరకొండ కి కూడా మంచి పేరు వచ్చి ఉండేదేమో అంటూ అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
లైగర్ లో పెద్ద మనస్ గా హీరో నత్తి ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.