యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో జాతీయ స్థాయి లోనే కాకుండా అంతర్జాతీయ స్తాయి లో కూడా గుర్తింపును దక్కించుకున్నాడు.ఇలాంటి సమయంలో ఆయన తదుపరి సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండాలి అంటూ అభిమానులు ఆశ పడుతున్నారు.
అందుకే ఎన్టీఆర్ 30 సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అభిమానుల అంచనాలకు తగ్గకుండా సినిమా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఆలస్యం అయినా పర్వాలేదు అంటున్నాడట.
తాజాగా ఎన్టీఆర్ మరియు కొరటాల శివ సినిమా గురించి మరో ఆసక్తికర పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కొరటాల శివ ఆచార్య సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ 30 సినిమా కోసం కథ ను సిద్దం చేసుకున్నాడు.
ఆ కథ ను కూడా ఎన్టీఆర్ ఓకే చెప్పాడు.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ కథ ను పూర్తిగా పక్కకు పెట్టేశారని తెలుస్తోంది.
సినిమా ను పూర్తిగా కొత్త కథతో చేయాలని నిర్ణయించారట.ఇటీవలే ఒక స్టోరీ లైన్ ను ఖరారు చేయడం జరిగింది.
ఆ లైన్ ను ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ డెవలప్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.పాన్ ఇండియా రేంజ్ లో ఆ కథ ఉండబోతుందని అంటున్నారు.ఎన్టీఆర్ కి బాగా నచ్చిన ఆ స్టోరీ లైన్ ను రెడీ చేసి సినిమా ను పట్టాలెక్కించేందుకు గాను నవంబర్ వరకు వెయిట్ చేయాలని నిర్ణయించారు.ఎన్టీఆర్ 30 సినిమా పట్టాలెక్కేందుకు నవంబర్ వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి విశ్రాంతి మూడ్ లో ఉన్నాడు.ఆయన గడ్డం భారీ గా పెంచి కాస్త బరువు కూడా పెరిగినట్లుగా తాజాగా అమిత్ షా ను కలిసిన సందర్బంగా లుక్ చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.
ఎన్టీఆర్ లుక్ ఎన్టీఆర్ 30 సినిమా లో ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.