భారతదేశంలో వివాహాలు ఎంత ఆర్భాటంగా జరుగుతాయో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఒక్కో సామజిక వర్గంలో ఒక్కో విధంగా పెళ్లిళ్లు జరుగుతాయి.
ఎవరు ఎలా చేసుకున్నా జరిగే హడావుడి ఒక్కటే.పెళ్లి పనులు ఓ నెలరోజుల ముందే సార్ట్ అవుతాయి.
ఈ క్రమంలో పెళ్లిళ్లలో కొన్ని చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.ఇక ఇటీవల కాలంలో జరిగిన పెళ్లిళ్లలో ప్రాంక్ లు కూడా ఎక్కువైపోయాయి.
అలాగే కొన్ని పెళ్లిళ్లలో వధూవరులు కొట్టుకోవడం, సరదాగా జోకులు వేసుకోవడం వంటివి పరిపాటిగా మారాయి.
తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో వరుడికి ఉన్నట్టుండి చిర్రెత్తుకొచ్చింది.దాంతో అందరూ షాక్ అయ్యే పని చేశాడు.
పెళ్లిలో వరుడి చేత కేక్ కట్ చేయించాలని బంధువులు అనుకున్నారు.అనుకున్నట్టే కేక్ తెచ్చి వరుడి ముందు పెట్టారు.
అతడు కూడా హ్యాపీగానే ఆ కేక్ కట్ చేశాడు.అయితే అక్కడే ఉన్న వ్యక్తి ఆ కేక్ ను వరుడికి తినిపించాలని అనుకున్నాడు.
కానీ అందుకు అతడు నిరాకరించాడు.
ఏదిఏమైనా పెళ్ళికొడుకు చేత కేక్ తినిపించాలని అతడు ట్రై చేశాడు.దాంతో వరుడికి చిర్రెత్తుకొచ్చింది.వెంటనే అతడి పై దూసుకెళ్లాడు.కోపంతో ఊగిపోయాడు.ఇంతలో వెనకున్న వ్యక్తి ఆపేందుకు ప్రయతించగా అతని పై కూడా సీరియస్ అయ్యాడు.అయినా కూడా ఉక్రోషం ఆపుకోలేక అక్కడ ఉన్న కేక్ ను తీసి గాల్లోకి విసిరికొట్టాడు.దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యేరు.
ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సీరియస్ వీడియో కాస్త నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది.
మీరు కూడా సరదాగా సదరు వీడియో చూసి నవ్వేసుకోండి మరి!
.