యూట్యూబర్ నికిల్ తో డాన్స్ చేసిన సురేఖవాణి, సుప్రీత.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి తన కూతురుతో కలిసి చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.తన కూతురుతో కలిసి ఈమె పొట్టి దుస్తులు ధరించి నిత్యం ఎన్నో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేక్ చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున పార్టీలు వెకేషన్స్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

 Surekhavani Supreeta Who Danced With Youtuber Nickel Trolling Netizens, Surekhav-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా ఈ ఇద్దరు కూతుర్లు యూట్యూబర్ నిఖిల్ తోకలిసి ఇంటర్వ్యూకు హాజరైన విషయం మనకు తెలిసిందే.ఈ ఇంటర్వ్యూలో భాగంగా నిఖిల్ ఈ ఇద్దరిని ఎన్నో ప్రశ్నలు అడిగారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుప్రీత తన కూతురికి రెండో పెళ్లి చేస్తానంటూ చెప్పిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.అదేవిధంగా తనకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ సురేఖ వాణి చేసిన ఈ కామెంట్స్ కూడా నెట్టింట తీవ్ర దుమారం రేపాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ఇంటర్వ్యూ అనంతరం ఈ తల్లి కూతుర్లు ఇద్దరు నిఖిల్ తో కలిసి డాన్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియోని నిఖిల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ అవుతుంది.

Telugu Supreeta, Surekhavani, Tollywood, Youtuber Nickel-Movie

ఇక నిఖిల్ మధ్యలో నిలబడి ఒకవైపు సురేఖ వాణి మరోవైపు సుప్రీతతో కలిసి అత్తో అత్తమ్మ కూతురో అనే రేంజ్ లో డాన్స్ చేశారు.ఇలా తల్లి కూతుర్లు ఇద్దరు నిఖిల్ తో కలిసి చిందులు వేయడంతో ఈ వీడియో పై పలువురు నెటిజన్ స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ తల్లి కూతుర్లను ట్రోల్ చేస్తున్నారు.ఏది ఏమైనా నిత్యం ఏదో ఒక వీడియో, ఫోటోల ద్వారా వీరిద్దరూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతున్నారు.అయితే వీరిద్దరూ డోంట్ కేర్ అన్నట్టు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube