వేదికపై నటుడు చెంప చెల్లుమనిపించిన విశాల్.. ఏం జరిగిందంటే?

సాధారణంగా ఒక సినిమా చిత్రీకరణ జరుపుకొని అనంతరం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.అయితే ఈ మధ్యకాలంలో హీరోలు కాస్త భిన్నంగా సినిమాలను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు.

 Hero Vishal Slapped Robo Vinod On Stage Know Details Inside , Hero Vishal, Robo-TeluguStop.com

ఈ మధ్యకాలంలో ఫ్రాంక్ వీడియోలతో సినిమాలను ప్రమోట్ చేయడంతో పెద్ద ఎత్తున సినిమా జనాలలోకి వెళ్లడమే కాకుండా కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణం అవుతుంది.ఇకపోతే తాజాగా ఇలాంటి ఫ్రాంక్ వీడియోతో ఒక్కసారిగా అందరిని హీరో విశాల్ ఆశ్చర్యానికి గురి చేశారు.

హీరో విశాల్ తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.తాజాగా ఈయన వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరికెక్కిన లాఠీ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

వేదికపై హీరో విశాల్ తో పాటు నటుడు రోబో శంకర్ వేదికపై విశాల్ తో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా అతని చెంప చెల్లుమనిపించారు.ఈ విధంగా విశాల్ తనపై చేయి చేసుకోవడంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే వేదికపై ఉన్న మరో వ్యక్తి నవ్వుకుంటూ కిందికి వెళ్లడంతో ఇది ఫ్రాంక్ అని తెలిసి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలతో పెద్ద ఎత్తున సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube