బుమ్రాని ఆకాశానికెత్తేసిన సచిన్ టెండూల్కర్.. వన్డేలలో అగ్రస్థానం అతడిదే!

జస్ప్రీత్ బుమ్రా గురించి పరిచయం అక్కర్లేదు.తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా రెచ్చిపోయి ఆడటంతో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం వెల్లువెత్తుతున్నది.

 Sachin Tendulkar Who Took Bumran To The Sky , Bhumra , Sachin Tendulkar , Tendul-TeluguStop.com

ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బుమ్రాను ఆకాశానికెత్తేసాడు.ఇంగ్లాండ్ తో తొలి వన్డే మ్యాచ్ ముగిశాక సచిన్ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ… “బుమ్రా 3 ఫార్మాట్లలో ఉత్తమ బౌలర్ అని నేనెప్పట్నుంచో చెబుతున్నాను.

ఓవల్ పిచ్ లో సాధారణంగానే బౌన్స్ వస్తుంది.కానీ టీమిండియా బౌలర్లు మాత్రం ఈ మ్యాచ్ లో రెచ్చిపోయారు.

సరైన లెంగ్త్ లు, స్వింగ్ తో అదరగొట్టారు.ముఖ్యంగా బుమ్రా అయితే ఒక అద్భుతం!” అని సచిన్ ట్వీట్ చేయడం ఇపుడు వైరల్ అవుతోంది.

ఇక ఈ మ్యాచ్ లో బుమ్రా.7.2 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.వికెట్ల విషయానికొస్తే సూపర్ అని చెప్పాలి.6 వికెట్లు తీసి ప్రత్యర్థులను మట్టికరిపించాడు.దాంతో ఇంగ్లాండ్..110పరుగులకే పరిమితం అయ్యింది.తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బుమ్రా.ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం విశేషం.ఇంగ్లాండ్ పై కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన బుమ్రా.వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరాడు.ICC తాజాగా విడుదల చేసిన టాప్-10 బౌలర్ల జాబితాలో బుమ్రా.718 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

ఇక బుమ్రా తర్వాత స్థానంలో న్యూజిలాండ్ పేసర్ అయినటువంటి ట్రెంట్ బౌల్ట్ (712 పాయింట్లు), పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది (681 పాయింట్లు) నిలిచారు.ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు బుమ్రా.రెండో స్థానంలో ఉండేవాడు.ఇక తాజాగా జరిగిన మ్యాచ్ వలన నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుకోవడం విశేషం.ఇకపోతే ఇంగ్లాండ్ తో ఇటీవలే ముగిసిన మూడో T20లో సెంచరీ చేయడం ద్వారా సూర్యకుమార్ యాదవ్. టీ20లలో టాప్-10 లోకి వచ్చాడు.అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకోవడం విశేషం.టాప్-10 లో ఇండియా తరఫున అతడొక్కడే ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube