సాయి పల్లవి అందుకు రెడీ అంటుంది..!

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి వరుస ప్రయోగాలతో కెరియర్ లో దూసుకెళ్తుంది.అమ్మడు చేస్తున్న సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె క్రేజ్ పెరుగుతుంది.

 Sai Pallavi Ready To Produce Movies Details, Sai Pallavi, Gargi, Sai Pallavi, Sa-TeluguStop.com

ఈమధ్యనే ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే స్క్రీన్ నేమ్ కూడా ఇచ్చేశారు.సాయి పల్లవికి ఆ ట్యాగ్ తగిలించడం వల్ల చాలా దుమారమే మొదలైంది.

సాయి పల్లవి లేటెస్ట్ గా గార్గి సినిమా రిలీజ్ కాబోతుంది.ఆ సినిమా ప్రమోషన్స్ లో అమ్మడు చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది.

ఇక ఈ క్రమంలో తన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సాయి పల్లవి.నచ్చిన కథ వస్తే నిర్మాతగా కూడా మారేందుకు తాను రెడీ అంటుంది సాయి పల్లవి.

ఈమధ్య హీరోలు కూడా తమ సినిమాలను తాము నిర్మించుకుంటున్నారు.అంతేకాదు స్టార్ హీరోలు చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇదే లెక్కన ఈమధ్య హీరోయిన్స్ కూడా సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు.అలా ఇప్పటికే కొందరు హీరోయిన్స్ సొంత బ్యానర్ పెట్టి సినిమాలు చేస్తుండగా వారి సరసన తాను కూడా నిలుస్తానంటుంది సాయి పల్లవి.

Telugu Gargi, Sai Pallavi, Sai Pallavi Ups, Tollywood, Virata Parvam, Virataparv

అయితే తాను నిర్మాతగా మారేందుకు కొద్దిగా టైం ఉందని.తనకు నిర్మించాలనిపించే కథ వస్తే తప్పకుండా సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అంటుంది సాయి పల్లవి.అంతేకాదు కేవలం ప్రయోగాలే కాదు కమర్షియల్ సినిమాల్లో కూడా తాను నటిస్తానని అంటుంది సాయి పల్లవి.పాత్ర ప్రాధాన్యతని బట్టి తన సినిమా సెలక్షన్ ఉంటుందని.స్టార్ సినిమా అయినా సరే పాత్ర ప్రాముఖ్యత ఉంటే అది నిడివి ఎంత తక్కువ ఉన్నా సరే సినిమా చేస్తానని అంటుంది సాయి పల్లవి. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో సాయి పల్లవి అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube