సాయి పల్లవి అందుకు రెడీ అంటుంది..!

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి వరుస ప్రయోగాలతో కెరియర్ లో దూసుకెళ్తుంది.అమ్మడు చేస్తున్న సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె క్రేజ్ పెరుగుతుంది.

ఈమధ్యనే ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే స్క్రీన్ నేమ్ కూడా ఇచ్చేశారు.

సాయి పల్లవికి ఆ ట్యాగ్ తగిలించడం వల్ల చాలా దుమారమే మొదలైంది.సాయి పల్లవి లేటెస్ట్ గా గార్గి సినిమా రిలీజ్ కాబోతుంది.

ఆ సినిమా ప్రమోషన్స్ లో అమ్మడు చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది.ఇక ఈ క్రమంలో తన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సాయి పల్లవి.

నచ్చిన కథ వస్తే నిర్మాతగా కూడా మారేందుకు తాను రెడీ అంటుంది సాయి పల్లవి.

ఈమధ్య హీరోలు కూడా తమ సినిమాలను తాము నిర్మించుకుంటున్నారు.అంతేకాదు స్టార్ హీరోలు చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇదే లెక్కన ఈమధ్య హీరోయిన్స్ కూడా సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు.అలా ఇప్పటికే కొందరు హీరోయిన్స్ సొంత బ్యానర్ పెట్టి సినిమాలు చేస్తుండగా వారి సరసన తాను కూడా నిలుస్తానంటుంది సాయి పల్లవి.

"""/"/ అయితే తాను నిర్మాతగా మారేందుకు కొద్దిగా టైం ఉందని.తనకు నిర్మించాలనిపించే కథ వస్తే తప్పకుండా సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అంటుంది సాయి పల్లవి.

అంతేకాదు కేవలం ప్రయోగాలే కాదు కమర్షియల్ సినిమాల్లో కూడా తాను నటిస్తానని అంటుంది సాయి పల్లవి.

పాత్ర ప్రాధాన్యతని బట్టి తన సినిమా సెలక్షన్ ఉంటుందని.స్టార్ సినిమా అయినా సరే పాత్ర ప్రాముఖ్యత ఉంటే అది నిడివి ఎంత తక్కువ ఉన్నా సరే సినిమా చేస్తానని అంటుంది సాయి పల్లవి.

 ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో సాయి పల్లవి అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు.

మంత్రివర్గంలో వీరికే ఛాన్స్ .. క్లారిటీ ఇచ్చేసిన దామోదర