వైరల్: అర్ధరాత్రి ఆ మాల్‌కి జనాలు క్యూలు కట్టారు? ఎందుకో తెలుసా?

మనలో బట్టలు షాపింగ్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి? నేటి యువతకి ఫాషన్ అంటే మక్కువ ఎక్కువ.కొత్త తరహా ఫాషన్ తో కూడిన క్లోత్స్ మార్కెట్లోకి వచ్చాయంటే కొనే వరకు నిద్ర పోరు.

 People Queued Up At That Mall At Midnight Do You Know Why Kerlaa, Mall, Viral-TeluguStop.com

అదే బ్రాండెడ్ దుస్తులు ఇక ఆఫర్లో దొరికితే ఇక అంతే.తమ వద్ద డబ్బులు లేకపోయినా, అప్పులు చేసైనా వాటిని కోనేవరకు నిద్రపోరు.20, 30 పర్సెంట్ అంటేనే మనవాళ్ళు ఎగబడతారే, అలాంటిది 50 శాతం డిస్కౌంట్ అంటే క్రౌడ్ మామ్మూలుగా ఉండదు.సదరు షాపింగ్ మాల్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక సంత మాదిరి తయారవుతుంది.

అక్కడి కస్టమర్ల క్రౌడ్ ని తట్టుకోవడం ఆ షాపింగ్ మాల్ యాజమాన్యం తరం కాదు.

తాజాగా అంతకు మించిన సీన్ ఒకటి జరిగింది.కేరళలో గల తిరువనంతపురం, కొచ్చిలో గల ఓ షాపింగ్ మాల్ ఈ ఆఫర్ పెట్టింది.ఈ 6వ తేదీన రాత్రి 11.59 గంటల నుంచి ఆ మరునాడు ఉదయం వరకు షాపింగ్ మాల్ తెరిచారు.ముందే ఆఫర్ తెలియడంతో జనం నుంచి రెస్పాన్స్ మామ్మూలుగా లేదు.

ఆ షాపింగ్ లో ఇసుకవేస్తే రాలనంత జనం గుమిగూడారు.కొందరు ఔత్సాహికులు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.

మెట్రో పాలిటన్ నగరాల్లో మిడ్ నైట్ షాపింగ్ మాల్ తెరిచామని నిర్వాహకులు తెలిపారు.

Telugu Bumper, Kerlaa, Mall, Latest-Latest News - Telugu

అయితే జనం ఈ విధంగా వస్తారని అస్సలు ఊహించలేదని యాజమాన్యం చెప్పడం కొసమెరుపు.ఇది జస్ట్ ట్రయల్ అని, మిడ్ సేల్ మరిన్ని రోజులు చేపడుతామని ఆ హోటల్ వారు చెప్పడం కొసమెరుపు.మాల్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ.

మిడ్ నైట్ సేల్ సమయంలో ఇబ్బందులు ఉంటాయని తమకు తెలుసు అని, అయితే భవిష్యత్‌లో అలాంటి సమస్యలను అధిగమిస్తామని తెలిపారు.ఇకపోతే సదరు వీడియోపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

కేరళ రాష్ట్రంలో ఇదీ బ్లాక్ ప్రైడేగా నిలిచిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube