చిత్ర పరిశ్రమలోకి వచ్చాక ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటారు అన్నది తెలియదు.కొందరు నటించడానికి వచ్చి డైరక్షన్ చేస్తుంటే.
కొందరు డైరక్షన్ చేయాలని వచ్చి నటిస్తూ ఉంటారు.వారికి వచ్చిన ఛాన్స్ ని వాడుకుంటూ వెళ్తూ కెరియర్ సాగిస్తుంటారు.
ఈ క్రమంలో లేటెస్ట్ గా డ్యాన్స్ మాస్టర్ గా పాపులర్ అయిన బాబా భాస్కర్ కొత్తగా యాక్టర్ అవతారమెత్తాడు.డ్యాన్స్ మాస్టర్స్ లో చాలా యాక్టివ్ గా ఉండే అతను బిగ్ బాస్ సీజన్ 3లో కూడా అలరించాడు.
ఆ తర్వాత చాలా షోస్ కి జడ్జ్ గా చేశాడు.బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు.ఈ క్రేజ్ తో ఆయనకు యాక్టర్ గా ఛాన్స్ వచ్చింది.యువ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో శ్రీధర్ గాదె డైరక్షన్ లో వస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పక్కన మామ పాత్రలో నటిస్తున్నాడు బాబా భాస్కర్.అతనికి ఉన్న కామెడీ టైమింగ్ కి ఈ పాటికే సినిమాల్లో ఛాన్సులు రావాల్సింది కానీ ఎందుకో లేట్ అయ్యింది.
హీరో పక్కన కమెడియన్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది.ఈ క్రమంలో బాబా భాస్కర్ మాస్టర్ ఈ కొత్త ఇన్నింగ్స్ ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పొచ్చు.సమ్మతమే సినిమాతో ఈమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడినితో రాబోతున్నాడు.ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తనయురాలు కోడి దివ్యా దీప్తి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో కిరణ్ సరసన సంజనా హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకులను అలరిస్తుంది.