కొంతమంది హీరోస్ తమ లుక్స్ తో ఒకటి రెండు సినిమాల్లో మెప్పించగానే వారికి యూత్ ఫాలోయింగ్ బాగా వస్తుంది వారు స్టార్ హీరోస్ అవుతారని అంతా భావిస్తారు కానీ యూత్ లో ఎంత ఒక క్రేజ్ ఉన్న కొంతమంది హీరోస్ ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు.అలా స్టార్ హీరో అవ్వాలన్న తపనతో ఏళ్లకు ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న సరైన హిట్టు లేక డీలాపడ్డ ఆ హీరోస్ ఎవరో చూద్దాం.
శర్వానంద్
ఎంతో టాలెంట్ ఉన్న నటుడు, అలాగే ఇతని లుక్స్ కి ఫిదా అవ్వని అమ్మాయిలు లేరంటే నమ్మండి కానీ ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ఫట్టు అన్నట్టుగా ఉంది శర్వానంద్ పరిస్థితి.సరైన సక్సెస్ లేకుండా ఆ శర్వానంద్ కెరియర్ గాడిలో లేదని చెప్పాలి.కానీ తనదైన రోజు వస్తే శర్వానంద్ ఎంతటి పాత్ర అయినా అలవోకగా పోషించగలడు, స్టార్ హీరో అవ్వగలడు.
నాగశౌర్య
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ఇప్పటివరకు సక్సెస్ ని అందుకోలేకపోయాడు.యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాగశౌర్య ఆ తర్వాత తన ప్రొడక్షన్ కంపెనీలో సైతం కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన అవి కూడా అరకొర సక్సెస్ లనే ఇచ్చాయి.ఇప్పటికీ నాగ శౌర్య తన దగ్గరికి మంచి కథ రాకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు.
సందీప్ కిషన్
అప్పుడెప్పుడో దశాబ్దం కాలం క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్ ఇప్పటికీ సరైన హిట్ ని తన ఖాతాలో వేసుకోలేకపోయాడు.మొత్తం కెరియర్ మీద ఒకటి రెండు హిట్స్ తప్ప మిగతావన్నీ యావరేజ్ సినిమాలు గానే ఉన్నాయి.కానీ ఎంతో టాలెంట్ ఉన్న సందీప్ కిషన్ కి మంచి పాత్ర వస్తే మాత్రం కచ్చితంగా స్టార్ హీరో అవ్వగలడు.
నవదీప్
తేజ దర్శకత్వంలో జై అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవదీప్ స్టార్ హీరో అవుతారని అందరూ భావించారు.ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు నవదీప్ కి సక్సెస్ ని ఇచ్చాయి.కానీ నవదీప్ కి ఉన్న కొన్ని లక్షణాలు తనకి సక్సెస్ ని దూరం చేయడమే కాదు తనకి అవకాశాల్ని కూడా దూరం చేశాయి.
ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలో రెండవ హీరో పాత్ర చేస్తూ నవదీప్ స్ట్రగిలింగ్ హీరో గానే మిగిలిపోయాడు.
ఇలా ఈ హీరోలంతా కూడా ఎన్ని సినిమాల్లో నటించినా యావరేజ్ హీరోలు గానీ మిగిలిపోతున్నారు.
వీరికి ఇకనైనా మంచి సినిమాలు పడి స్టార్ హీరోస్ గా టర్న్ అవుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.