వెంకటేష్ నాగార్జున నటించిన ఈ రెండు సినిమాలకు మధ్య ఇంత కథ నడిచిందా ?

అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల నాడి ఒక్కటే.అందరూ ప్రేక్షకులు ఒకేలా ఉంటారు బాలీవుడ్, కోలీవుడ్ శాండిల్ వుడ్ అనే తేడా ఏమీ ఉండదు.

 Tollywood Early Days Pan India Movies, Tollywood, Venkatesh , Nagarjuna, Shanth-TeluguStop.com

అలాగే మన తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఏమీ మినహాయింపు కాదు.ఏ సినిమా వచ్చినా 90% అన్ని భాషల్లో ప్రేక్షకులు ఒకేలా ఆదరిస్తారు.

సినిమా బాగుంటే చూస్తారు లేదా తిప్పి కొడతారు.అందుకు ఉదాహరణగా ఇప్పుడు మనం ఒక రెండు సినిమాల గురించి తెలుసుకుందాం.

మొదటి సినిమా వెంకటేష్ నటించిన చంటి.ఈ సినిమా తెలుగులో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలుసు.

నిజానికి ఈ సినిమా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది తమిళంలో చిన్న తంబి, కన్నడలో రామాచారి, అలాగే హిందీలో అనారి, తెలుగులో చంటి.ఇలా ఈ నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఒక రకంగా పాన్ ఇండియా సినిమానే చెప్పుకోవచ్చు.

చంటి సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.అంతేకాదు ఈ సినిమాతో మరొక సినిమాకి లింక్ ఉంది.అదేంటంటే శాంతి క్రాంతి, కన్నడలో చంటి సినిమాని రామాచారి అనే పేరుతో రవిచంద్రన్ హీరోగా నటించగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది అయితే రవిచంద్రన్ ఈ సినిమాలో నటించడానికి ఒక కారణం ఉంది.రవిచంద్రన్ అప్పటికే శాంతి క్రాంతి అనే సినిమా నాలుగు భాషల్లో తెరకెక్కించడానికి, అతని దర్శకత్వంలో అంత సిద్ధం చేసుకున్నాడు.

ఈ సినిమా తెలుగులో నాగార్జున హీరోగా తెరకెక్కితే, కన్నడలో రవిచంద్రన్ హీరోగా చేశాడు, అలాగే తమిళం, హిందీ భాషల్లో రజనీకాంత్ హీరోగా పెట్టి ఈ సినిమా తీశారు.అయితే ఈ సినిమా సగం బడ్జెట్ పూర్తయ్యాక డబ్బులు లేకపోవడంతో సినిమా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ఈ సినిమాకి రవిచంద్రన్ హీరో అలాగే దర్శకుడు, నిర్మాత కూడా కావడంతో రామాచారి సినిమా తీసి దాంట్లో వచ్చిన డబ్బులతో శాంతి క్రాంతి సినిమాను పూర్తి చేశాడు అంటే ఈ సినిమా పూర్తవడానికి ఈ చంటి సినిమా బాగా ఉపయోగపడింది రవిచంద్రన్ కి.నిజానికి ఇలా నాగార్జున, రవిచంద్రన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోస్ ఒక సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీయడం అప్పట్లో ఇది పెను సంచలనమే.అందరూ కూడా అగ్రహీరోలు, అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అన్ని భాషల్లో కూడా ఈ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

Telugu Chanti, Nagarjuna, Rajinnikanth, Ravichandran, Shanth Kranthi, Tollywood,

వాస్తవానికి ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సినిమా నిడివి రెండు గంటల 22 నిమిషాలు అంటే 142 నిమిషాలు.దీంట్లో 43 నిమిషాల పాటు పాటలే ఉంటాయి మిగతా ఓ పావుగంట హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ఉంటుంది అలాగే మొదటి ఐదు నిమిషాలు టైటిల్స్ తో ఫుల్ అయితుంది.అంటే కథ కేవలం గంటన్నర మాత్రమే.

చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే కథంతా కూడా హీరో, హీరోయిన్ చుట్టూ మాత్రమే తిరుగుతుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను బయటకు తెచ్చేది హీరో.అలాగే ఫైట్స్ అంతా కూడా హీరోనే చేస్తాడు కాబట్టి కథ మొత్తం అంతా నడిపించేది హీరో.

అతనికి సాయంగా హీరోయిన్ ఉంటుంది ఇందులో రెండవ హీరో ఉన్నప్పటికీ కేవలం జోక్స్ వేయడానికి తప్ప ఇందులో మరొక స్థానం లేదు అతడికి.దాంతో ఈ సినిమాలో ఎటు చూసినా కూడా అసలు కథ అనేది కనిపించలేదు దాంతో సినిమా ఫ్లాప్ అయింది.

నిజానికి ఈ సినిమా ఇప్పుడు తీసిన కూడా ఫ్లాప్ అవుతుంది.కొన్నిసార్లు మనం ఖలేజా సినిమా ఎందుకు థియేటర్లో ప్లాప్ అయింది అని ఆలోచిస్తాం కానీ శాంతి క్రాంతి లాంటి సినిమా ఫ్లాప్ అయిందంటే పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.

అందుకే ఒకే సమయంలో రిలీజ్ అయిన శాంతి క్రాంతి అన్ని భాషల్లో ఫ్లాప్ అవ్వగా చంటి సినిమా అన్ని భాషల్లో హిట్ అయింది ఈ రెండిటికీ మధ్య ఉన్న సంబంధం ఒకటే ఒకటి అదే హీరో రవిచంద్రన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube