సౌత్ ఇండియాను మొత్తం చుట్టేయడానికి రెడీ అవుతున్న టైర్-2 హీరోలు!

ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే.పాన్ ఇండియా సినిమా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.

 Young Heroes Are Getting Ready To Release Movies In South India Details, Nani, V-TeluguStop.com

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అంటూ ఏ ఇండస్ట్రీలో చూసినా ఒకటే మాట వినిపిస్తుంది.గత కొంత కాలంగా సొంత బాషాకే పరిమితం అయినా హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే స్టార్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటి పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకున్నారు.

బాహుబలి సినిమాతో ప్రభాస్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాన్ ఇండియా హీరోలుగా ప్రోమోట్ అయ్యారు.

మహేష్ బాబు ను రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా చేయబోతున్నాడు.ఇక ఇప్పుడు టైర్ 2 హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో కాకపోయినా ముందు సౌత్ మొత్తం కవర్ చేయాలని చూస్తున్నారు.

వారి టార్గెట్ ను సెట్ చేసుకుని వరుస సినిమాలు చేస్తున్నారు.

టైర్ 2 హీరోల్లో ఒక్క విజయ్ దేవరకొండ మినహా మిగతా వారు ప్రెసెంట్ సౌత్ భాషలను కవర్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

Telugu Akhil, Karthikeya, Liger, Naga Chaitanya, Nani, Nani Dasara, Nikhil, Ram

విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నాడు.ఆ తర్వాత రామ్ పోతినేని ఈ లిస్టులో ఉన్నారు. ది వారియర్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా బైలింగ్వన్ మూవీగా తెరకెక్కింది.

Telugu Akhil, Karthikeya, Liger, Naga Chaitanya, Nani, Nani Dasara, Nikhil, Ram

నాని కూడా పక్క మార్కెట్ పై కన్నేశాడు.ఈయన నటిస్తున్న ప్రతి సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.ఈయన నటించిన శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు సౌత్ లో మిగతా భాషల్లో కూడా రిలీజ్ అయ్యాయి.ఇక నాగ చైతన్య కూడా వెంకట్ ప్రభు దర్శకత్వంలో బైలింగ్వన్ మూవీ చేయబోతున్నాడు.

Telugu Akhil, Karthikeya, Liger, Naga Chaitanya, Nani, Nani Dasara, Nikhil, Ram

అలాగే నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 సినిమాతో తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేసి సౌత్ లో మిగతా భాషల్లో కూడా మార్కెట్ సంపాదించాలని ట్రై చేస్తున్నాడు.గోపీచంద్ కూడా సింగం సిరీస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో బైలింగ్వన్ మూవీ చేయనున్నాడు.అలాగే అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాను తమిళ్ లో కూడా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.ఇలా టైర్ 2 జాబితాలో ఉన్న హీరోలంతా సౌత్ భాషలపై కన్నేసి అక్కడ మార్కెట్ పై పట్టుసాధించాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube