వాతావరణ మార్పుల పరిశీలనకు అత్యంత చిన్న శాటిలైట్ డిజైన్ చేసిన సైంటిస్ట్స్‌..

సూర్యుని నుంచి భూమికి వచ్చే శక్తిని కనుగొనాలంటే ప్రత్యేకమైన పరికరాలు అవసరం.టోటల్ సోలార్ ఇరేడియన్స్ అంటే విద్యుదయస్కాంత వికిరణం రూపంలో సూర్యుడి నుంచి పొందే శక్తి.

 Nasa Scientists Designed Very Small Satellite To Monitor Climate Changes Details-TeluguStop.com

అయితే వీటిని కొలవాలంటే పెద్ద పరికరాలు అవసరం అవుతాయి.నాసా మాత్రం అతి చిన్న ఉపగ్రహంతో ఈ శక్తిని కొలిచేందుకు సిద్ధమైంది.

అదే కాంపాక్ట్ టోటల్ ఇరేడియన్స్ మానిటర్‌. ఒక షూబాక్స్-సైజ్ ఉండే ఈ శాటిలైట్‌ని స్పేస్‌లోకి పంపేందుకు సిద్ధమైంది.

సాధారణంగా సూర్యుడిపై నుంచి వచ్చే శక్తి భూమిపై వాతావరణ మార్పులకు కారణమవుతుంది.ఫలితంగా ఈ ఉపగ్రహంతో వాతావరణ మార్పులను కూడా పరిశీలించడం సాధ్యమవుతుంది.

ఎర్త్ రేడియేషన్‌లో సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ ప్రధాన భాగంగా ఉంటుంది.

గ్రీన్‌హౌస్ వాయువులు.

వాతావరణంలో బాగా పెరుగుతున్న సౌరశక్తిని ప్రభావితం చేస్తాయి.వీటివల్ల సముద్ర జలాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ మార్పులకు సౌరశక్తి కూడా కారణమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.అందుకే ఈ చిన్న ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమయ్యారు.

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్. 2005 -2019 మధ్య కాలంలో భూవాతావరణంలో సౌర వికిరణం దాదాపు రెండింతలు పెరిగిందని కనుక్కున్నది.

అయితే ఈ సౌర వికిరణాలను కచ్చితత్వంతో కొలిచేందుకు సమర్థవంతంగా పనిచేసే పరికరాలు కావాలి.

Telugu Nasa, Satilite, Solar Energy, Small Satellite, Latest, Change-Latest News

అయితే వాటికి ఖర్చు చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.దీనితో ప్రత్యామ్నాయంగా కాంపాక్ట్ టోటల్ ఇరేడియన్స్ మానిటర్ ను నాసా రూపొందించింది.ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి లో-ఆర్బిట్ ప్రవేశపెట్టేందుకు అయ్యే ఖర్చు, సంక్లిష్టత చాలా వరకు తగ్గుతుంది.

కాంపాక్ట్ టోటల్ ఇరేడియన్స్ మానిటర్‌లో బోలోమీటర్ అనే ఓ రేడియేషన్ డిటెక్టర్ ఉంటుంది.ఇది ఇన్‌కమింగ్ లైట్‌లో 99.995% పసిగడుతుంది.ఇందులోనే క్యూబ్‌శాట్ ప్లాట్‌ఫామ్ నుంచి డేటాను సేకరించేందుకు కాంపాక్ట్ స్పెక్ట్రల్ ఇరేడియన్స్ మానిటర్(CSIM)అనే డివైజ్ అమర్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube