యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.
అందుకే ఈయనకు హిట్ వచ్చినా చాలు అనుకుంటే విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే తాజాగా ఈ సినిమాపై మహేష్ బాబు కూడా ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
కమల్ హాసన్ నటనను మెచ్చుకోవడమే కాకుండా.లోకేష్ కనకరాజ్ పై ప్రశంసలు కురిపించి ఈయనను ఆకాశానికి ఎత్తేసారు.
మహేష్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.అయితే విక్రమ్ సినిమాపై స్పందించిన మహేష్ బాబు ఈ సినిమా కంటే ముందే వచ్చిన కేజిఎఫ్ 2 సినిమాపై కామెంట్ ఎందుకు చేయలేదు అనే విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే మహేష్ బాబు కేజిఎఫ్ 2 సినిమాను లైట్ తీసుకోవడానికి ఒక కారణం ఉందని.అందుకే ఇండస్ట్రీ హిట్ అయినా ఈ సినిమాపై మహేష్ బాబు స్పందించలేదని వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇందుకు ప్రధానంగా ఒక కారణం చెబుతున్నారు. కెజిఎఫ్ పార్ట్ 1 వచ్చినప్పుడు ముందుగా విష్ చేసింది మహేష్ బాబునే.
ఈయన కెజిఎఫ్ సినిమాకు ఇంప్రెస్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాడట.వీరితో పాటు ప్రభాస్, ఎన్టీఆర్ కూడా సినిమా చేయాలనీ అనుకోవడమే కాకుండా ఈయనతో సినిమా కూడా ప్రకటించాడు.కానీ మహేష్ తో మాత్రం నీల్ సినిమా వర్కౌట్ అవ్వలేదు.ఇందుకు కారణం కూడా చెబుతున్నారు.మహేష్ తో సినిమా అంటే ఖచ్చితంగా రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా పార్ట్నర్ షిప్ కూడా ఉంటుంది.
అందుకే వీరి కాంబోలో మూవీ సెట్ అయ్యి ఉండకపోవచ్చు అని చెబుతున్నారు.
దీంతో మహేష్ బాగా హార్ట్ అయ్యాడని అందుకే కెజిఎఫ్ 2 పై ఎలాంటి ప్రశంసలు అందించలేదని అందుకు కారణం ఇదేనని ఇప్పుడు టాక్ నడుస్తుంది.మరి ముందు ముందు అయినా వీరి కాంబోలో సినిమా ఉంటుందో లేదో చూడాలి.